AP Assembly : ఏపీ అసెంబ్లీ సమావేశాలు..ముందే మొదలైన రగడ

ఏపీ అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్‌ చేసింది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. ఒన్ డే మ్యాచ్‌లా.. ఒకరోజు మాత్రమే బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. సమావేశాలకు వచ్చేది లేదంటూ తేల్చిచెప్పింది టీడీపీ. మరి టీడీపీ ఎందుకు బాయ్‌కాట్‌ చేసింది..టీడీపీ నేతలు చెబుతున్న రీజన్స్‌ ఏంటి..? అధికార పార్టీ వైసీపీ కౌంటర్‌ ఏంటో ఒకసారి చూద్దాం.

AP Assembly : ఏపీ అసెంబ్లీ సమావేశాలు..ముందే మొదలైన రగడ

Ap Budget Sessions 2021

AP Assembly : ఏపీ అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్‌ చేసింది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. ఒన్ డే మ్యాచ్‌లా.. ఒకరోజు మాత్రమే బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. సమావేశాలకు వచ్చేది లేదంటూ తేల్చిచెప్పింది టీడీపీ. మరి టీడీపీ ఎందుకు బాయ్‌కాట్‌ చేసింది.. టీడీపీ నేతలు చెబుతున్న రీజన్స్‌ ఏంటి..? అధికార పార్టీ వైసీపీ కౌంటర్‌ ఏంటో ఒకసారి చూద్దాం.

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మొదలవక ముందే.. ఏపీలో పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి. రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో.. రాజకీయ రచ్చ మొదలైంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పోను మిగిలిన తొమ్మిది నెలలకు సంబధించిన పూర్తి బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. రెండేళ్ల తన పాలనలో కేవలం 38 రోజులే శాసససభ సమావేశాలు నిర్వహించడం పట్ల టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వానికి సమాంతరంగా ప్రజా సమస్యలనే అజెండాగా తీసుకొని మాక్ అసెంబ్లీ నిర్వహించే ఆలోచనలో ప్రతిపక్ష పార్టీ ఉంది. అయితే.. అధికార వైసీపీ కూడా.. ప్రతిపక్షం ఆరోపణలపై కౌంటర్‌ ఎటాక్‌ స్టార్ట్‌ చేసింది.

రేపు ఏపీ అసెంబ్లీ బడ్జట్ సమావేశం జరగనుంది. ఒన్ డే మ్యాచ్‌లా ఒక్కరోజుకే బడ్జెట్‌ సమావేశాలను పరిమితం చేయాలని నిర్ణయించింది వైసీపీ సర్కార్‌. బీఏసీ సమావేశంలో ఇదే నిర్ణయాన్ని తీసుకోనుంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బడ్జెట్‌ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో.. బడ్జెట్‌ ఆమోదం దాదాపు ఏ చర్చ లేకుండానే ముగియనుంది. బడ్జెట్‌ సమావేశాలను బహిష్కరించడం.. ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను తెలియజేయడమేనంటున్నారు ఆ పార్టీ నేతలు. అసెంబ్లీ సమావేశాలు రాజ్యాంగపరంగా తప్పనిసరి.. అందుకే గతిలేక నిర్వహిస్తున్నారని మండిపడ్డారు శాసనమండలి టీడీపీ ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు.

మార్చిలో అసెంబ్లీ పెట్టమంటే కరోనా ఉందని చెప్పిన సీఎం జగన్‌.. ఇప్పుడేమో తూతూ మంత్రంగా ఒక్కరోజు సమావేశానికి పరిమితమయ్యారని మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు. 900 కేసులున్నప్పుడు అసెంబ్లీ పెడితే, శాసనసభ్యుల ప్రాణాలకు ప్రమాదమని చెప్పిన సీఎం.. 2 లక్షలకు పైగా కేసులున్న టైమ్‌లో సమావేశాలు ఎలా పెడుతున్నాడని ప్రశ్నించారు.

అయితే.. టీడీపీ ఆరోపణలపై అదే రేంజ్‌లో కౌంటర్‌ ఎటాక్‌ స్టార్ట్‌ చేసింది అధికార వైసీపీ. కరోనా సంక్షోభంలో బడ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకే తప్పనిసరిగా అసెంబ్లీ పెట్టాల్సి వస్తోందని క్లారిటీ ఇచ్చారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పరిస్థితులు బాగోలేవు కాబట్టే.. ఒక్కరోజు అసెంబ్లీ పెట్టామని చెప్పారాయన. టీడీపీ సభ్యులు వస్తే వాళ్లకి గౌరవం ఉంటుందని.. లేకపోతే చేసేందేమీ లేదంటూ.. టీడీపీ నిర్ణయాన్ని సజ్జల తేలిగ్గా తీసిపారేశారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు బహిష్కరణ అంశం.. ప్రతిపక్ష టీడీపీ.. అధికార వైసీపీలకు కొత్తేమీ కాదు. అయితే.. కరోనా టైమ్‌లో ప్రధాన ప్రతిపక్షం లేకుండా.. పెద్దగా చర్చ లేకుండా జరుగనున్న ఏపీ బడ్జెట్‌ సమావేశం ద్వారా వడ్డింపులు, కోతలు, వాతలు ఎలా ఉంటాయో చూడాలి మరి.