AP Cabinet Expansion : ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు

10మంది ప్రస్తుత మంత్రులకు రీజినల్‌ ఇన్‌ఛార్జ్‌ పదవులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మిగిలిన మంత్రులకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని టాక్‌ వినిపిస్తోంది.

AP Cabinet Expansion : ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు

Ap Cabinet

Updated On : March 26, 2022 / 3:05 PM IST

AP Cabinet expansion : ఏపీలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 10 లేదా 11న ఏపీ కేబినెట్‌ విస్తరించడానికి విశాఖ శారదా పీఠాధిపతి ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. ముగ్గురు మినహా ప్రస్తుత మంత్రులందర్నీ తప్పించబోతున్నారు సీఎం జగన్‌. ప్రస్తుత మంత్రుల్ని పార్టీ పదవుల్లో నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు.

10మంది ప్రస్తుత మంత్రులకు రీజినల్‌ ఇన్‌ఛార్జ్‌ పదవులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మిగిలిన మంత్రులకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని టాక్‌ వినిపిస్తోంది. కొత్త మంత్రివర్గ కసరత్తు దాదాపు పూర్తైనట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

AP Cabinet Expansion : ఏపీ కేబినెట్ విస్తరణ.. మంత్రివర్గంలో ఎవరిని ఉంచుతారు? ఎవరిని తొలగిస్తారు?

ఎవరికి అవకాశం దక్కుతుందన్న దానిపై పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేబినెట్‌ విస్తరణలో కొత్తగా ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయన్న దానిపై వైసీపీలో ఉత్కంఠ నెలకొంది.