CM Jagan : మూడు పథకాలకు రూ. 2191 కోట్ల నిధులు విడుదల.. నేరుగా రైతుల ఖాతాల్లో జమ

ఏపీలో వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ, యంత్ర సేవా పథకాలకు నిధులు విడుదల అయ్యాయి. ఈ మూడు పథకాలకు మొత్తం రూ. 2191 కోట్ల నిధులను సీఎం జగన్ రిలీజ్ చేశారు.

CM Jagan : మూడు పథకాలకు రూ. 2191 కోట్ల నిధులు విడుదల.. నేరుగా రైతుల ఖాతాల్లో జమ

Cm Jagan

CM Jagan released three schemes funds : ఏపీలో వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ, యంత్ర సేవా పథకాలకు నిధులు విడుదల అయ్యాయి. ఈ మూడు పథకాలకు మొత్తం రూ. 2191 కోట్ల నిధులను సీఎం జగన్ రిలీజ్ చేశారు. ఈ మూడు పథకాలకు ఇప్పటికే రూ.977 కోట్లు జమ చేశారు. ఇవాళ మరో రూ. 1,214 కోట్లు జమ చేశారు. వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ పథకం కింద రెండో విడత నిధులను విడుదల చేశారు. అలాగే 2020 ఖరీఫ్‌కు సంబంధించిన సున్నావడ్డీ పంట రుణాలు, వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద కూడా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు.

రైతుల కళ్లలో వారం రోజుల ముందే దీపావళి కాంతులు చూడాలని రైతు భరోసా విడుదల చేస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు. వరుసగా మూడో సంవత్సరం రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రెండో విడత సాయం 2వేల 52 కోట్లు విడుదల చేస్తున్నామని.. 50లక్షల 37వేల మంది రైతన్నలకు మేలు జరుగుతుందని చెప్పారు. ఆగస్టులో రూ.972 కోట్లు విడుదల చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలనూ చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.

Badvel By-Election : ఏ ఎన్నికలు జరిగినా..వార్ వన్ సైడే

రాష్ట్రంలోని 1720 రైతు గ్రూపులకు నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు. తమది రైతుపక్షపాత ప్రభుత్వం అని అన్నారు. పోగాకు రైతులకూ బాసటగా నిలిచామని చెప్పారు. ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేశామని.. రైతులు ఏ పంటలు వేయాలన్న దానిపై సలహాలు, సూచనలు చేశామని తెలిపారు.

ఈ-క్రాపింగ్‌ విధానం ద్వారా అవకతవకలు లేకుండా చేశామని చెప్పారు. యంత్రీకరణ ద్వారా వ్యవసాయాన్ని మెరుగుపరుస్తున్నామని తెలిపారు. అధికారులను రైతులకు అందుబాటులో ఉంచుతున్నామని జగన్ అన్నారు. ఆర్బీకే పరిధిలో వ్యవసాయ ధరలు ఉంటాయని తెలిపారు. కేంద్రం ఇచ్చిన 17 రకాల పంటలకు ఎంఎస్‌పీ ఇస్తామని స్పష్టం చేశారు. మరో 7 పంటలకు సైతం గిట్టుబాటు ధరలు ఇస్తున్నామని చెప్పారు.

East Godavari : పోలీసు, ఉద్యోగుల కళ్లలో కారం కొట్టిన మహిళా రేషన్ డీలర్

ఇదివరకే ఆగస్టులో రెండో విడత వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ కింద 977 కోట్ల రూపాయలు జమ చేశారు. అది పోను.. మిగిలిన మొత్తం 12వందల 14 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. వరుసగా మూడో ఏడాది రెండవ విడతగా 50లక్షల 37వేల మంది రైతన్నలకు 2వేల 52 కోట్ల రూపాయల లబ్ది చేకూరుస్తోంది. సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా క్రింద ఏటా 13వేల 500రూపాయల సాయం అందిస్తోంది.

మరోవైపు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద 6లక్షల 67వేల మంది రైతన్నల ఖాతాల్లో 112కోట్ల70లక్షల రూపాయల వడ్డీ రాయితీ జమ చేస్తున్నారు. వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద 17వందల 20 రైతు గ్రూపులకు 25కోట్ల 55 లక్షల నగదు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది.