CM Jagan Slams Chandrababu : నాకు, చంద్రబాబుకి అదే తేడా-సీఎం జగన్ హాట్ కామెంట్స్

పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ సభలో మాట్లాడిన జగన్.. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబుకి, తనకు ఉన్న తేడా ఏంటో చెప్పారు.

CM Jagan Slams Chandrababu : నాకు, చంద్రబాబుకి అదే తేడా-సీఎం జగన్ హాట్ కామెంట్స్

Cm Jagan Slams Chandrababu

CM Jagan Slams Chandrababu : విశాఖ, అనకాపల్లి జిల్లాలలో పర్యటించిన సీఎం జగన్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ సభలో మాట్లాడిన జగన్.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై ఫైర్ అయ్యారు. చంద్రబాబుకి, తనకు ఉన్న తేడా ఏంటో చెప్పారు సీఎం జగన్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటే, ప్రతిపక్షంలో ఉన్న నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నా అని అన్నారు జగన్. నాకు నా వాళ్లతో ఉండాలనే నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నా అన్న జగన్.. నాకు, చంద్రబాబుకి ఉన్న తేడా అదే అంటూ హాట్ కామెంట్స్ చేశారు.

సొంతింటితో.. అక్కచెల్లెమ్మలకు శాశ్వత చిరునామా, హోదా వస్తుందన్నారు సీఎం జగన్. పైసా పైసా కూడబెట్టి ఒక మంచి చోట స్థలం కొని ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడమే జీవిత పరమార్ధంగా భావించే పరిస్థితులు నేడు రాష్ట్రంలో ప్రతి చోటా ఉన్నాయన్నారు. ఇల్లు.. పిల్లలకు ఇచ్చే ఒక ఆస్తిగా భావిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో సొంతిల్లు లేని వారు ఉండకూడదని ఎన్నికల్లో మాట ఇచ్చామన్నారు జగన్.(CM Jagan Slams Chandrababu)

గురువారం విశాఖ, అనకాపల్లి జిల్లాలలో పర్యటించిన సీఎం జగన్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. 1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీని సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం నుంచి జగన్ ప్రారంభించారు. అక్కడ 300 ఎకరాల్లో పేదలకు 10 వేల 228 ప్లాట్లను అందజేశారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ సభలో మాట్లాడిన జగన్.. కాలనీలో ఇళ్లతో పాటు స్కూళ్లు, విలేజ్ క్లినిక్ లు, అంగన్వాడీ సెంటర్ల వంటివి ఏర్పాటు చేస్తామన్నారు. మార్కెట్ యార్డు, సచివాలయ నిర్మాణమూ జరుగుతుందన్నారు.

CM Jagan Good News : 2 నెలల్లో వస్తుంది, ఇల్లు లేని వారికి సీఎం జగన్ గుడ్ న్యూస్

జగన్ కు ఎక్కడ మంచి పేరొస్తుందోనని.. జగన్ కు ప్రజలు ఎక్కడ మద్దతిస్తారోనని కొందరు కడుపు మంటతో రగిలిపోతున్నారని పరోక్షంగా చంద్రబాబుపై మండిపడ్డారు జగన్. కోర్టు కేసులు వేశారని ధ్వజమెత్తారు. ఆ కోర్టు కేసులు ఎప్పుడెప్పుడు పోతాయా? అక్కచెల్లెమ్మలకు ఎప్పుడు మంచి చేద్దామా? అని 489 రోజులు వేచి చూశానన్నారు. దేవుడి దయ వల్ల ఇప్పుడు ఆ సమస్య తీరిపోయిందని చెప్పారు.

ఇల్లు అంటే ప్రతి ఒక్కరికీ శాశ్వత చిరునామా ఇచ్చినట్టు అని జగన్ అన్నారు. అందరికీ సొంతిల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం మంచి చేస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో కనీసం 5 లక్షల ఇళ్లు కూడా కట్టలేదని, కానీ, తమ ప్రభుత్వం మాత్రం 30.7 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని జగన్ చెప్పారు.(CM Jagan Slams Chandrababu)

గత ప్రభుత్వం ఎంతమందికి ఇళ్లు కట్టించి ఇచ్చిందో ఆలోచించాలని జగన్ అన్నారు. అదే మా ప్రభుత్వంలో వచ్చిన మార్పు చూడాలన్నారు. చంద్రబాబు హయాంలో కనీసం 5లక్షల ఇళ్లు మాత్రమే కట్టారని జగన్ తెలిపారు. కడుపు మంటతో దుష్ట చతుష్టయం ప్రతి దాన్ని అడ్డుకుంటోందని మండిపడ్డారు జగన్. ”అమరావతిలో పేదలకు 54 వేల ఇళ్ల పట్టాలు ఇస్తామంటే కులాల మధ్య విభజన వస్తుందని కోర్టుకెళ్లి అడ్డుకున్నారు. వీళ్లకు పచ్చకామెర్లు, బీపీలు వచ్చాయి. ఎన్ని అడ్డంకులు, ఇబ్బందులు వచ్చినా జగన్ వెనకడుగు వెయ్యడు. పంచగ్రామల సమస్య కోర్టులో ఉంది. వారం 10 రోజుల్లో తాడి గ్రామానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా” అని జగన్ అన్నారు.

Chandra Babu Naidu: ప్రచార ఆర్భాటం తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదు: చంద్రబాబు

నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు, హౌసింగ్‌ స్కీమ్‌ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు సీఎం జగన్‌. ‘రోజుకో అబద్ధ ప్రచారంలో మునిగిపోతున్న దుష్టచతుష్టయం చేస్తున్న కుయుక్తులను, మంచిని చేస్తుంటే అడ్డుకుంటున్న ప్రయత్నాలను ప్రజలు గమనించాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా మాట తప్పను, ఇచ్చిన హామీలు నెరవేర్చి తీరుతా. పాదయాత్రలో, ఎన్నికల ప్రణాళికలో 25 లక్షల మందికి పైగా ఇళ్లు కటిస్తామని మాటిచ్చాం. కానీ, అదనంగా, మెరుగైన సౌకర్యాలతోనే ఇళ్లు కట్టిస్తున్నాం. ఇళ్ల ప‌ట్టాల పంపిణీకి 16 నెల‌ల క్రిత‌మే అడుగులు వేశాం. కానీ, మన ప్రభుత్వం మంచి చేస్తుంటే కడుపు మంటతో కొందరు రగిలిపోతున్నారు. మన పాలనకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని అడ్డుకున్నారు. క‌ల సాకార‌మ‌వ్వ‌డానిక 489 రోజులు పట్టింది’ అని జగన్ అన్నారు.