CM Jagan Good News : 2 నెలల్లో వస్తుంది, ఇల్లు లేని వారికి సీఎం జగన్ గుడ్ న్యూస్

ఇల్లు అంటే ప్రతి ఒక్కరికీ శాశ్వత చిరునామా. అందరికీ సొంతిల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రూ.35 వేల కోట్లు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చినట్లు అవుతుంది.(CM Jagan Good News)

CM Jagan Good News : 2 నెలల్లో వస్తుంది, ఇల్లు లేని వారికి సీఎం జగన్ గుడ్ న్యూస్

Cm Jagan Good News

CM Jagan Good News : గురువారం విశాఖ, అనకాపల్లి జిల్లాలలో పర్యటించిన సీఎం జగన్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. 1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీని సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం నుంచి జగన్ ప్రారంభించారు. అక్కడ 300 ఎకరాల్లో పేదలకు 10 వేల 228 ప్లాట్లను అందజేశారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ సభలో మాట్లాడిన జగన్.. కాలనీలో ఇళ్లతో పాటు స్కూళ్లు, విలేజ్ క్లినిక్ లు, అంగన్వాడీ సెంటర్ల వంటివి ఏర్పాటు చేస్తామన్నారు. మార్కెట్ యార్డు, సచివాలయ నిర్మాణమూ జరుగుతుందన్నారు.

ఇక్కడ ఇంటి స్థలం విలువే రూ.6 లక్షలు అని కలెక్టర్ చెప్పారని జగన్ అన్నారు. ఇక్కడ గజం స్థలం విలువ రూ.12 వేలుందని, ఒక్కో లబ్ధిదారుల కుటుంబానికి 50 గజాల చొప్పున స్థలం, అందులో ఇల్లు కట్టించి ఇస్తున్నామని తెలిపారు. 16 నెలల క్రితమే లబ్ధిదారులకు ఇళ్లు ఇచ్చే పథకానికి బాటలు వేశామని, ఇప్పుడు పేదల కల సాకారమయ్యేలా ఇళ్ల పట్టాలు అందించడం ఆనందంగా ఉందన్నారు.(CM Jagan Good News)

అయితే, జగన్ కు ఎక్కడ మంచి పేరొస్తుందోనని.. జగన్ కు ప్రజలు ఎక్కడ మద్దతిస్తారోనని కొందరు కడుపు మంటతో రగిలిపోతున్నారని పరోక్షంగా చంద్రబాబుపై మండిపడ్డారు జగన్. కోర్టు కేసులు వేశారని అన్నారు. ఆ కోర్టు కేసులు ఎప్పుడెప్పుడు పోతాయా? అక్కచెల్లెమ్మలకు ఎప్పుడు మంచి చేద్దామా? అని 489 రోజులు వేచి చూశానన్నారు. దేవుడి దయ వల్ల ఇప్పుడు ఆ సమస్య తీరిపోయిందని చెప్పారు.

YS Jagan Tour : నేడు విశాఖకు సీఎం జగన్.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ..!

ఇల్లు అంటే ప్రతి ఒక్కరికీ శాశ్వత చిరునామా ఇచ్చినట్టు అని జగన్ అన్నారు. అందరికీ సొంతిల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం మంచి చేస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో కనీసం 5 లక్షల ఇళ్లు కూడా కట్టలేదని, కానీ, తమ ప్రభుత్వం మాత్రం 30.7 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని జగన్ చెప్పారు.

రాష్ట్రంలో మొత్తం 17 వేల జగనన్న కాలనీలను నిర్మించబోతున్నామని, రెండో దశ నిర్మాణాలను ప్రారంభించాల్సిందిగా అధికారులను ఆదేశించామని తెలిపారు. గ్రామాల్లో ఒకటిన్నర సెంట్లు, పట్టణాల్లో ఒకటి నుంచి ఒకటిన్నర సెంట్ల మధ్య స్థలాలను ఇస్తున్నామన్నారు.(CM Jagan Good News)

”ఈ ఒక్క కాలనీలో 10వేల 200 ప్లాట్ల ఇళ్ల నిర్మాణం జరగబోతోంది. స్కూళ్లు, పార్కులు, హెల్త్ సెంటర్లు అన్నీ రాబోతున్నాయి. జగన్ కు మద్దతు పెరుగుతుందన్న భయం ప్రతిపక్షంలో పెరుగుతోంది. అందుకే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. రాష్ట్రంలో సొంతిల్లు లేని వారు ఉండకూడదని ఎన్నికల్లో మాట ఇచ్చా. ఈరోజు అంతకంటే ఎక్కువ 30లక్షల 70వేల మందికి మేలు చేస్తున్నాము. వీటిలో 15 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. 17వేల జగనన్న కాలనీలు వస్తాయి. రెండో దశ ప్రారంభం అవుతాయి. రెండో దశలో లక్ష 65 వేల మందికి ఇళ్లు కట్టుకోవడానికి అనుమతి పత్రాలు ఇస్తాము. మరో 3 లక్షల ఇల్లు, రెండు టిట్ కో ఇల్లు ప్రారంభం కాబోతున్నాయి.

30 లక్షల 70 వేల మందికి 60వేలకు పైచిలుకు ఎకరాలు ఇళ్ల పట్టాల కోసం పంచాము. ఇల్లు లేదని ఎవరు భాదపడొద్దు. సచివాలయంలో అప్లయ్ చెయ్యండి. అర్హత ఉంటే రెండు నెలల్లో వస్తుంది. మాకు ఎవరికీ పథకాలు కట్ చెయ్యాలని లేదు. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండాలని 3 ఆప్షన్లు ఇచ్చాము. పావలా వడ్డీకి 35వేలు ఇచ్చేలా బ్యాంకులతో మాట్లాడుతున్నాము. 35 వేల కోట్లు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చినట్లు అవుతుంది. మరో 32 వేల కోట్ల అభివృద్ధి పనులకు ఖర్చుపెడుతున్నాం. రాష్ట్రంలో ప్రతి నలుగురికి ఇల్లు కట్టించాము. ఇల్లు ఇవ్వడం మాత్రమే కాదు రెండు ఫ్యాన్లు రెండు ఎల్ఈడీ బల్బులు ఇస్తాము.

పేదోడికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా..340 గజాల ఇల్లు ఇస్తున్నాం – సీఎం జగన్

28 వేల ఇళ్లు ఇప్పటికే పూర్తి చేశాము. గత ప్రభుత్వం ఎంతమందికి ఇళ్లు కట్టించి ఇచ్చిందో ఆలోచించండి. అదే మా ప్రభుత్వంలో వచ్చిన మార్పు చూడండి. చంద్రబాబు హయాంలో కనీసం 5లక్షల ఇళ్లు మాత్రమే కట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటే, ప్రతిపక్షంలో ఉన్న నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నా. నాకు నా వాళ్లతో ఉండాలనే నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నా. అదే నాకు, చంద్రబాబుకి ఉన్న తేడా. కడుపు మంటతో దుష్ట చతుష్టయం ప్రతి దాన్ని అడ్డుకుంటోంది. అమరావతిలో పేదలకు 54 వేల ఇళ్ల పట్టాలు ఇస్తామంటే కులాల మధ్య విభజన వస్తుందని కోర్టుకెళ్లి అడ్డుకున్నారు. వీళ్లకు పచ్చకామెర్లు, బీపీలు వచ్చాయి. ఎన్ని అడ్డంకులు, ఇబ్బందులు వచ్చినా జగన్ వెనకడుగు వెయ్యడు. పంచగ్రామల సమస్య కోర్టులో ఉంది. వారం 10 రోజుల్లో తాడి గ్రామానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. సుజల స్రవంతి పూర్తి చేయడానికి అడుగులు వేస్తున్నాము” అని జగన్ అన్నారు.