పేదోడికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా..340 గజాల ఇల్లు ఇస్తున్నాం – సీఎం జగన్

పేదోడికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా..340 గజాల ఇల్లు ఇస్తున్నాం – సీఎం జగన్

Distribution Of House Pattas At Srikalahasti : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అర్హులైన పేదవాళ్లకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా..తమ ప్రభుత్వం ఇళ్లు కట్టిచ్చి ఇస్తోందని సీఎం జగన్ వెల్లడించారు. ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో లబ్ది దారుల ఎంపికలో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడలేదని మరోసారి స్పష్టం చేశారు. ఓటు వేయని వారికి అర్హత ఉంటే..వారికి ఈ పథకం వర్తింపచేసే విధంగా తమ ప్రభుత్వం చూసిందన్నారు. 2020, డిసెంబర్ 28వ తేదీ సోమవారం..చిత్తూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్‌ పర్యటించారు. పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ పథకంలో భాగంగా.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో పేదలకు ఇళ్ల స్ధలాల పంపిణీ, తొలి విడతలో నిర్మించనున్న ఇళ్ల పనులను, పైలాన్‌ను సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ..

పక్కా ఇళ్లు నిర్మించి (స్థలంతో పాటు) ఇస్తున్నట్లు, పారదర్శకత ఏ స్థాయిలో ఉందో..గమనించాలని ప్రజలకు సూచించారు. వార్డు సచివాలయాల్లో లబ్దిదారుల పేర్లను డిస్ ప్లే చేసినట్లు, ఇంకా మిగిలిపోయినట్లు ఉంటే..అప్లై చేసుకుంటే..90 రోజుల్లోనే..ఇంటి పట్టాలిచ్చే నిరంతర ప్రక్రియగా చేయడం జరిగిందని చెప్పారు. 31 లక్షల ఇల్లు కట్టించబోతున్నట్లు, కుటుంబంలో నలుగురు ఉన్నట్లు అనుకుంటే…కోటి 24 లక్షల మందికి భూమితో సహా పక్కా ఇళ్లు ఇచ్చే తమ ప్రభుత్వమేనన్నారు.

రెవెన్యూ గ్రామాలు 17 వేలు అంటే..17 వేల లే అవుట్లు వస్తున్నాయని, కాలనీలు కావు..ఊర్లు రాబోతున్నాయన్నారు. ఇళ్లు ఉచితంగా కట్టించడమే కాకుండా..అన్నీ మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. కాలనీలో నివాసం ఉండే జనాభా సంఖ్యను బట్టి పార్కులు, అంగన్ వాడీలు, స్కూళ్లు, విలేజ్ క్లినిక్‌లు అవసరాన్ని బట్టి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 224 చదరపు అడుగులు కడుతున్నారంటే..సంతోషంగా ఉండడం ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో…340 గజాల ఇళ్లను కట్టించబోతున్నామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా..68 వేల 361 ఎకరాల భూముల్లో లే అవుట్లు వేసి అభివృద్ధి చేసి ఇస్తున్నామన్నారు సీఎం జగన్.