YS Jagan Mohan Reddy : రేపటి నుంచి 3 రోజులపాటు కడప జిల్లాలో సీఎం జగన్ టూర్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి నుంచి 3 రోజులపాటు కడపజిల్లాలో పర్యటించి పలు అభివృధ్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

Ys Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి నుంచి 3 రోజులపాటు కడపజిల్లాలో పర్యటించి పలు అభివృధ్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి కడప చేరుకునే ఆయన, అక్కడి నుంచి ప్రొద్దుటూరు వెళతారు. అక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
అనంతరం బద్వేల్ నియోజక వర్గంలోని గోపవరంలో సెంచురి ప్లైఉడ్ కంపెనీకి శంకుస్ధాపన చేస్తారు. అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత కడప సమీపంలోని కొప్పర్తికి చేరుకుంటారు. అక్కడ మెగా ఇండ్రస్ట్రియల్ హబ్ కు శంకుస్థాపన చేసి రాత్రికి ఇడుపుల పాయ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
Also Read : Property Dispute : ఆస్తి కోసం తల్లిని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్ళిన మున్సిపల్ చైర్మన్
24వ తేదీ ఉదయం ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ కు చేరుకుని అక్కడ తన తండ్రికి నివాళులర్పించనున్నారు. అనంతరం పులివెందులకు చేరుకుని ఇండ్రస్ట్రియల్ డెవలప్ మెంట్ పార్క్ లో ఆదిత్య బిర్లాయూనిట్ కు శంకుస్ధాపన చేసి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
క్రిస్మస్ పండుగ సందర్భంగా 25వ తేదీ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ ప్రార్ధనల్లో పాల్గోంటారు. ప్రార్ధనల అనంతరం గన్నవరం బయలుదేరి వెళతారు.