AP Government : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

జీవోల (ప్రభుత్వ ఉత్తర్వులు) విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్ లైన్ లో జీవోలు పెట్టకూడదని నిర్ణయించింది. జీవోలను ఆఫ్ లైన్ లోనే..

AP Government : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Ap Government

AP Government : జీవోల (ప్రభుత్వ ఉత్తర్వులు) విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్ లైన్ లో జీవోలు పెట్టకూడదని నిర్ణయించింది. జీవోలను ఆఫ్ లైన్ లోనే పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పింది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు సమాచారం అందించింది. ఇకపై ఆఫ్ లైన్ లో మాత్రమే ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటాయని స్పష్టం చేసింది.

జీవోల విషయంలో పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాన్ని అవలంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. వైసీపీ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై పబ్లిక్ డొమైన్ లో ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు ఏవీ కనిపించవు. అయితే ఇలా జీవోలను పబ్లిక్ డొమైన్ లో ఉంచడం 2008లో ప్రారంభం కాగా, ఇప్పుడు ఆ విధానానికి బ్రేక్ పడింది. ఇటీవల బ్లాంక్ జీవోల జారీ వివాదస్పదం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.