Chintamani Natakam: చింతామణి నాటకంపై ఇంప్లీడ్ పిటిషన్‌లు.. హైకోర్టు అసహనం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చింతామణి నాటకం నిషేధం వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది.

Chintamani Natakam: చింతామణి నాటకంపై ఇంప్లీడ్ పిటిషన్‌లు.. హైకోర్టు అసహనం!

High Court

Chintamani Natakam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చింతామణి నాటకం నిషేధం వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. చింతామణి నాటకం నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కోర్టులో విచారణ జరగ్గా నిషేధాన్ని సమర్థిస్తూ ఆర్యవైశ్య సంఘాల తరఫున మూడు ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు.

వైశ్యులు వేసిన మూడు ఇంప్లీడ్ పిటిషన్లపై అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు. 100 లేక 200 పిటిషన్లు వేస్తారా? అని ప్రశ్నించారు హైకోర్టు న్యాయమూర్తి. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌‌పై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. విచారణను సాగదీసేందుకే ఇంప్లీడ్ పిటిషన్లు వేస్తున్నారా? అని ప్రశ్నించింది హైకోర్టు.

సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించింది హైకోర్టు. అభ్యంతరం ఉన్న పాత్రను మాత్రమే నిషేధించాలని కోరుతున్నామని న్యాయవాది ఉమేష్ చంద్ర వెల్లడించారు. మొత్తము నాటకాన్ని ఎలా నిషేధిస్తారు అని ప్రశ్నించారు ఉమేష్ చంద్ర.

కన్యాశుల్కం నాటకంలో అభ్యంతరాలున్నాయని చెబితే మొత్తం నాటకాన్ని నిషేధిస్తారా? అని ప్రశ్నించారు న్యాయవాది. రామాయణంలో అభ్యంతరకర పాత్రలు ఉన్నాయని రామాయణాన్ని నిషేదించమంటే ఎలా అని ప్రశ్నించారు.

వందేళ్ల నుంచి ప్రదర్శిస్తున్న నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ప్రశ్నించారు ఉమేష్. ఇదిలా ఉంటే ఆర్టిస్ట్‌ల తరుపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వేసిన పిటిషన్‌ బెంచ్‌కి బదిలీ అయ్యింది. కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.