Corona Treatment : ఆరోగ్యశ్రీ కింద చేరిన కరోనా బాధితుడి నుంచి రూ.6 లక్షలు డిమాండ్..కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ద్వారంపూడి

ఏపీలో కరోనా బాధితుల నుంచి హాస్పిటల్ దందా కొనసాగుతునే ఉంది. కరోనా వైద్య ప్రక్రియలను ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చినా..కొన్ని ఆసుప్రత్రులు కరోనా బాధితుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడు ఇనోదయా ఆసుపత్రి ఇటువంటి దోపిడీకే పాల్పడింది. ఆరోగ్యశ్రీ కింద చేరిన కరోనా బాధితుడికి నుంచి ఇనోదయా ఆసుపత్రి యాజమాన్యం రూ.6 లక్షలు డిమాండ్ చేసింది.

Corona Treatment : ఆరోగ్యశ్రీ కింద చేరిన కరోనా బాధితుడి నుంచి రూ.6 లక్షలు డిమాండ్..కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ద్వారంపూడి

Corona Treatment

Rs. 6 lakh demanded for Corona treatment  : ఏపీలో కరోనా బాధితుల నుంచి హాస్పిటల్ దందా కొనసాగుతునే ఉంది. కరోనా వైద్య ప్రక్రియలను ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చింది. అయినా సరే కొన్ని ఆసుప్రత్రులు కరోనా బాధితుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడు ఇనోదయా ఆసుపత్రి ఇటువంటి దోపిడీకే పాల్పడింది. ఆరోగ్యశ్రీ కింద చేరిన కరోనా బాధితుడికి నుంచి ఇనోదయా ఆసుపత్రి యాజమాన్యం రూ.6 లక్షలు డిమాండ్ చేసింది.ఈ విషయం ఎమ్మెల్యే ద్వారంపూడి దృష్టికి రావటంతో సదరు ఆసుపత్రిపై జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

ఆసుప్రతి యాజమాన్యం డిమాండ్ చేసిన డబ్బు కట్టలేక బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డిని ఆశ్రయించటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల వేదన అర్థం చేసుకున్న ఎమ్మెల్యే ద్వారంపూడి ఈ విషయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఇనోదయా ఆసుప్రతిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఏపీ ప్రభుత్వం కరోనా వైద్య ప్రక్రియలను ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చింది. అలాగే కరోనా రోగుల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు భారీగా డబ్బు గుంజుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో కరోనా వైద్యానికయ్యే ఫీజులను నిర్ధారించింది. ఈ మేరకు కరోనా వైరస్ వైద్యానికయ్యే ఫీజులను నిర్ధారించినా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వసూళ్ల దందా మాత్రం ఆగలేదు.