Sai Teja : సాయితేజ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది-మంత్రి పెద్దిరెడ్డి

తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన చిత్తూరు జిల్లావాసి సాయితేజ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఏపీ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శ

Sai Teja :  సాయితేజ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది-మంత్రి  పెద్దిరెడ్డి

Sai Teja Family Eguva Regada

Sai Teja :  తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన చిత్తూరు జిల్లావాసి సాయితేజ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఏపీ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పారు. ఆయన ఈరోజు కురబలకోట మండలం ఎగువరేగడకు చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం  సాయితేజ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.50 లక్షల సహయం చెక్కును అతని భార్యకు అందించారు. సాయితేజ్ కుటుంబ సభ్యులను పరామర్శిచారు.

సాయి తేజ్ త్యాగం వెలకట్టలేనిదని… ఆ కుటుంబ సభ్యులు మరికొన్నింటిని కోరారు. ముఖ్యమంత్రితో మాట్లాడి వాటిని కూడా మంజూరు చేస్తామని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చెప్పారు. బిపిన్ రావత్ లాంటి ఉన్నత స్థాయి వ్యక్తుల వద్ద పని చేస్తూ సాయి తేజ మరణించడం బాధాకరమని నారాయణ స్వామి అన్నారు. సాయితేజ్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, వారికుటుంబానికి ఇంటి స్థలం ఇచ్చే అంశాలను సీఎం జగన్‌తో మాట్లాడి మంజూరు చేయిస్తాఅని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.
Also Read : Attica Gold Company : అట్టికా గోల్డ్ కంపెనీలో చోరీ-దొంగలెవరు ?

కాగా …శనివారం ఉదయం డీఎన్ఏ పరీక్షల ఆధారంగా సాయి తేజ్ భౌతికకాయాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం సాయితేజకు ఆస్పత్రిలో పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి.. మిలటరీ లాంఛనాలతో సాయితేజ స్వస్థలానికి భౌతికకాయాన్ని తరలించారు. రేపు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.