AP Ministers Resignations : సీఎం జగన్ కు రాజీనామా పత్రాలు సమర్పించిన మంత్రులు

మంత్రుల రాజీనామా లేఖలను జీఏడీ అధికారులు సాయంత్రం గవర్నర్ కు పంపనున్నారు. గవర్నర్ ఆమోదించగానే ప్రస్తుత మంత్రులంతా మాజీ మంత్రులవుతారు.

AP Ministers Resignations : సీఎం జగన్ కు రాజీనామా పత్రాలు సమర్పించిన మంత్రులు

Cm Jagan (2)

AP Ministers Resignations :  సీఎం జగన్ కు మంత్రులు రాజీనామా పత్రాలు సమర్పించారు. అందరి మంత్రుల వద్ద నుంచి రాజీనామా పత్రాలను జగన్ తీసుకున్నారు. మొదట కేబినెట్ సమావేశానికి రాజీనామా లేఖలతోనే వచ్చిన మంత్రులు ముఖ్యమంత్రికి సమర్పించారు. మంత్రుల రాజీనామా లేఖలను జీఏడీ అధికారులు సాయంత్రం గవర్నర్ కు పంపనున్నారు. గవర్నర్ ఆమోదించగానే ప్రస్తుత మంత్రులంతా మాజీ మంత్రులవుతారు. అలాగే ఈనెల 10న కొత్త మంత్రుల జాబితాను గవర్నర్ కు సీఎం జగన్ పంపనున్నారు. ఈనెల 11న కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయనుంది.

కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం ముగియనుంది. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణే లక్ష్యంగా సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణపై.. సీఎం జగన్‌ మంత్రులకు, పార్టీ నేతలకు క్లారిటీ ఇవ్వనున్నారు. ఎందుకు మంత్రివర్గ విస్తరణ చేయాల్సి వస్తుంది.. ప్రస్తుతమున్న మంత్రివర్గంలో ఉన్నవారిలో కొందరిని ఎందుకు కొనసాగించాలని అనుకుంటున్నారనే విషయాలను క్యాడర్‌కు చెప్పనున్నారు. కేవలం మంత్రులకు క్లారిటీ ఇవ్వడమే కాదు.. మొత్తం మంత్రివర్గంలోని 24 మంది మంత్రులతో సీఎం జగన్‌ రాజీనామా చేయిస్తారని తెలుస్తోంది.

AP Cabinet Expansion : ఏపీ కేబినెట్ విస్తరణ.. మంత్రివర్గంలో ఎవరిని ఉంచుతారు? ఎవరిని తొలగిస్తారు?

విస్తరణకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. ఇటు మంత్రుల్లో.. అటు మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో టెన్షన్ పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు అందరివీ ఊహాగానాలే తప్ప.. అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి ఎలాంటి స్పష్టమైన సమాచారం రాలేదు. ప్రస్తుతం ఉన్నవారిలో ముగ్గురు లేదా నలుగుర్ని మాత్రమే.. కొత్త కేబినెట్‌లోకి తీసుకుని.. మిగిలినవారందర్నీ తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది.

దీంతో ప్రస్తుత కేబినెట్‌లో ఉన్న మంత్రుల్లో ఎవరు మళ్లీ నెక్ట్స్‌ కేబినెట్‌లో ఉండనున్నారు..? ఎవరికి ఉద్వాసన పలుకుతారు.. కొత్తగా ఎవరికి అవకాశం కల్పిస్తారన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. సీఎం మనసులో ఎవరున్నారో తెలియక అందరిలోనూ టెన్షన్ నెలకొంది.