A.P.Forest Department : అటవీశాఖ ఆఫీసులో రూ.కోటి విలువైన శ్రీగంథం చెక్కలు మాయం

అనంతపురం పెనుకొండ అటవీశాఖ కార్యాలయంలో శ్రీగంధం దుంగలు మాయమయ్యాయి.కోటి రూపాయల విలువైన శ్రీగంధం దుంగలు మాయం కావటంతో అధికారులు విచారణ చేపట్టారు.

A.P.Forest Department : అటవీశాఖ ఆఫీసులో రూ.కోటి విలువైన శ్రీగంథం చెక్కలు మాయం

Missing Sandalwood In The Ap Penugonda Forest Department Office

Missing sandalwood in the AP forest department office : అనంతపురం పెనుకొండ అటవీశాఖ కార్యాలయంలో శ్రీగంధం చెక్కలు మాయమయ్యాయి. 2021 ఆగస్టులో అక్రమంగా తరలిస్తున్న శ్రీగంధం చెక్కలను మడకశిర మండలం బత్తరహల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. అక్రమార్కుల నుంచి  స్వాధీనం చేసుకున్న కోటి రూపాయల విలువైన శ్రీగంధం చెక్కలను పెనుగొండ అటవీశాఖ కార్యాలయంలోనే భద్రపరిచారు. అప్పటి నుండి అక్కడే ఉన్న శ్రీగంధం చెక్కల బ్యాగులు చోరీ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ చోరీ వెనుక ఇంటి దొంగలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. సాక్షాత్తు అటవీశాఖ కార్యాలయం నుంచి వీటిని మాయం చేశారు అంటే అది అధికారుల నిర్లక్ష్యమా? లేదా కేటుగాళ్ల చేతివాటానికి ఇది నిదర్శనమా? అనే అనుమానాలు వస్తున్నాయి. శ్రీగంధ సాగు లక్షల్లో వస్తుంది. ఒక్కసారి మొక్కలు నాటితే లక్షల్లో ఆదాయం వస్తుంది.

Also read : Punjab elections : పంజాబ్‌ ఎన్నికలు వాయిదా పడే అవకాశం..

గంధపుచెక్క చక్కటి ఆహ్లాదకరమైన సువాసనలు వెదజల్లుతుంది. ఈ చెక్క నుండి నూనెను తయారు చేస్తారు. పరిమళాలకు, ఔషధాల కోసం ఉపయోగిస్తారు. శ్రీగంధ చెట్లు సాగు చేయటంతో భారత్ ప్రసిద్ది చెందింది. భారతదేశం, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, పసిఫిక్ ద్వీపాలలో ఇవి విరివిగా పెరుగుతాయి. దీన్ని ఇండోనేషియా, మలేషియాలలో చందన అని పిలుస్తారు. శ్రీగంధం చెక్కలు బలంగా, పసుపురంగులో, అత్యుత్తమంగా ఉంటాయి. ఇవి ఇతర సుగంధ చెక్కలలా కాకుండా దశాబ్దాలపాటు సువాసనను కలిగి ఉంటాయి.

గంధపు నూనె అనేది గంధపుచెట్ల యొక్క గంధపుచెక్కల నుండి కట్ చేసిన చిప్స్, బిల్లేట్ల ఆవిరి స్వేదనం నుండి లభించే ఒక సుగంధపు తైలం. గంధం నూనెను పరిమళ ద్రవ్యాలలోను, సౌందర్య సాధనలలోను, పవిత్ర లేపనాలలోను ఉపయోగిస్తారు.