AP Corona Cases : ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 425 కేసులు, రెండు మరణాలు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 425 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్ తో చనిపోయారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 19వేల 769 కరోనా పరీక్షలు చేశారు.

AP Corona Cases : ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 425 కేసులు, రెండు మరణాలు

Ap Corona Cases

Updated On : February 19, 2022 / 5:49 PM IST

AP Corona Cases : ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 425 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్ తో చనిపోయారు. చిత్తూరు, కృష్ణా జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 19వేల 769 కరోనా పరీక్షలు చేశారు.

గడిచిన 24 గంటల్లో 1,486 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 3,29,58,399 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14వేల 710కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7వేల 358 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,15,950. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,93,882. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కాగా, క్రితం రోజుతో(495 కేసులు) పోలిస్తే కరోనా కేసులు తగ్గాయి.

AP Covid : ఏపీలో కరోనా.. ఊపిరిపీల్చుకుంటున్న జనాలు, కొత్తగా ఎన్ని కేసులంటే

దేశంలో రోజురోజుకూ కరోనా కొత్త కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ముందురోజు 25 వేలకు దిగొచ్చిన కొత్త కేసులు.. తాజాగా 22,270కి పడిపోయాయి. శుక్రవారం 12 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. పాజిటివిటీ రేటు రెండు శాతం(1.8 శాతం) దిగువకు చేరి ఊరటనిస్తోంది. శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ ఈ గణాంకాలు తెలిపింది.

AP Reports 425 New Corona Cases And Two Covid Deaths

Ap Corona

కొవిడ్ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో యాక్టివ్ కేసులు 2.5 లక్షలకు తగ్గాయి. ఆ కేసుల రేటు 0.59 శాతానికి క్షీణించింది. నిన్న ఒక్కరోజే 60 వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ 4.28 కోట్ల మందికి కరోనా సోకగా.. 4.20 కోట్ల మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.12 శాతానికి చేరింది. 24 గంటల వ్యవధిలో 325 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందురోజు కంటే మరణాల సంఖ్య(492)లో తగ్గుదల కనిపించింది. మొత్తంగా 5,11,230 మంది కోవిడ్ తో చనిపోయారు.

AP Reports 425 New Corona Cases And Two Covid Deaths

Corona Cases In Ap

గతేడాది జనవరి నుంచి దేశంలో కరోనా టీకా కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది. అప్పటినుంచి 175 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. అలాగే దేశంలో 80 శాతం మంది వయోజనులు రెండు డోసుల టీకా తీసుకున్నారని, 100 శాతం వ్యాక్సినేషన్ దిశగా దేశం పయనిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం 36 లక్షల మందికి పైగా టీకా వేయించుకున్నారు.

AP Secretariat : సచివాలయంలో కోవిడ్ నిబంధనలు ఎత్తివేత.. అందరూ రావాల్సిందే

దేశంలో కరోనా కేసుల కొండ కరుగుతోంది. ఫస్ట్, సెకండ్ వేవ్‌తో పోల్చినప్పుడు థర్డ్ వేవ్ లో కేసులు ఎంత వేగంగా పెరిగాయో.. ఇప్పుడు అదే స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. కేవలం మూడు వారాల్లోనే 3 లక్షల స్థాయి నుంచి 30 వేల స్థాయికి కేసులు పడిపోయాయి. దీంతో రాష్ట్రాలు సైతం ఆంక్షలు సడలిస్తున్నాయి. ఫలితంగా దేశ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.