నన్నే డిక్టేట్ చేస్తారా : ఇన్ సైడర్ పై విచారణకు ఆదేశించే హక్కుంది – స్పీకర్

  • Published By: madhu ,Published On : January 20, 2020 / 08:20 AM IST
నన్నే డిక్టేట్ చేస్తారా : ఇన్ సైడర్ పై విచారణకు ఆదేశించే హక్కుంది – స్పీకర్

టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని విరుచకపడ్డారు. లిమిట్‌లో ఉండాలని టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడికి స్పీకర్ హెచ్చరించారు. నన్ను మీరు డిక్టేట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాజధాని అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్‌లో దోషులెవరో కఠినంగా శిక్షించాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపక్ష నేతగా ఉండి నీకు అధికారం ఎవరిచ్చారని అంటారా అంటూ తీవ్రంగా స్పందించారు. 
 

అసలు స్పీకర్ ఎందుకంత ఫైర్ అయ్యారు ? 
2020, జనవరి 20వ తేదీ సోమవారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి. వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి, CRDA బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశ పెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుని మంత్రి బొత్స సత్యనారాయణలు ప్రవేశపెట్టారు. ముందుగా వికేంద్రీకరణ బిల్లుపై మంత్రి బుగ్గన చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ సైడర్‌ జరిగిందని, వాస్తవాలు సభకు వినిపించారు. చర్చ ముగిసిన అనంతరం మంత్రి బోత్స సత్యనారాయణ మాట్లాడారు. 

దీనిపై స్పీకర్ స్పందించారు. రాజధాని భూములపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎంను కోరుతున్నట్లు వెల్లడించారు స్పీకర్ తమ్మినేని. స్పీకర్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డు తగిలారు. సభాపతిగా నాకు చెప్పే హక్కు ఉందని వెల్లడించారు. సభలో ప్రస్తావించిన అంశాలపైనా విచారణ జరిపించమనే అధికారం నాకు లేదా అంటూ ప్రశ్నించారు. సభ తేల్చాలన్నారు. 

దీనిపై మంత్రి బోత్స స్పందన.
సభాపతి పట్ల టీడీపీ సభ్యులు దారుణంగా మాట్లాడారని మంత్రి బోత్స వెల్లడించారు.  స్పీకర్‌పై అభ్యంతరకరంగా మాట్లాడిన ప్రతిపక్ష నేత చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ, సభాపతి అంటే చంద్రబాబుకు గౌరవం లేదన్నారు మంత్రి బోత్స. 

Read More : రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై పక్కా విచారణ :  సీఎం జగన్