AP High Court: బాంబే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకం..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తండ్రి, సోదరుల నుంచి ఘనమైన వారసత్వం కొనసాగిస్తున్నారు. ధీరజ్ సింగ్ 25 ఏప్రిల్ 1964లో జన్మించారు. మాతృరాష్ట్రం జమ్మూ కశ్మీర్.

AP High Court: బాంబే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకం..

AP High Court

AP High Court Chief Justice: బాంబే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు ఇద్దరు న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తున్నట్లు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రకటించారు. అలహాబాద్ హైకోర్టుకు చెందిన జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. బాంబే హైకోర్టుకు చెందిన జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారని మేఘవాల్ ట్వీటర్ వేదికగా వెల్లడించారు. ఈనెల 5వ తేదీన సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ అందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం జారీ చేసింది. అయితే, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘావాల్ తన ట్విటర్ ఖాతాలో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను సంప్రదించి ఈ నియామకానికి ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు.

AP High Court : ఏపీ హైకోర్టు తరలింపు ప్రతిపాదనేదీ పెండింగ్ లో లేదు : కేంద్ర న్యాయశాఖ

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తండ్రి, సోదరుల నుంచి ఘనమైన వారసత్వం కొనసాగిస్తున్నారు. ధీరజ్ సింగ్ 25 ఏప్రిల్ 1964లో జన్మించారు. మాతృరాష్ట్రం జమ్మూ కశ్మీర్. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ తీరథ్‌సింగ్ ఠాకుర్ తమ్ముడు ధీరజ్ సింగ్ ఠాకూర్. ఈయన తండ్రి దేవీదాస్ ఠాకూర్. ప్రధానోపాధ్యాయుడిగా వృత్తి జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి హైకోర్టు న్యాయమూర్తిగా, రాష్ట్ర మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా, గవర్నర్‌గా పనిచేశారు. ధీరజ్ సింగ్ ఠాకుర్ 1989 అక్టోబర్ 18న ఢిల్లీ, జమ్మూకశ్మీర్ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2011లో సీనియర్ అడ్వొకేట్‌గా పదోన్నతి పొందారు. 2013 మార్చి 8న జమ్మూకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడంతో మే 19 నుంచి ఖాళీ అయిన స్థానం భర్తీ చేయడానికి కొలీజియం జస్టిస్ ధీరజ్ సింగ్ పేరును సిఫార్సు చేసింది.

AP High Court Recruitment : ఏపీ స్టేట్‌ హైకోర్టులో లా క్లర్క్ పోస్టుల భర్తీ

 

జమ్మూ కశ్మీర్ హైకోర్టు మాతృకగా ఉన్న న్యాయమూర్తుల్లో ఈయనే అత్యంత సీనియర్. 2022 జూన్ 10న బాంబే హైకోర్టుకు బదిలీ అయి ప్రస్తుతం అక్కడే సేవలందిస్తున్నారు. గత ఫిబ్రవరి 9న కొలీజియం ఈయన్ను మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగదా బదిలీ చేయాలని సిఫార్సు చేసినా అది ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉండటంతో కొలీజియం ఆ సిఫార్సును రద్దు చేసి ఈ నెల 5న ధీరజ్ సింగ్ ను ఏపీ హైకోర్టు సీజేగా నియమించాలని నిర్ణయించింది. ధీరజ్ సింగ్ నియామకంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో జమ్మూకశ్మీర్, లద్ధాఖ్ హైకోర్టుకు ప్రాతినిధ్యం లభిస్తుందని కొలీజియం పేర్కొంది.