APPSC Prelims : గుడ్ న్యూస్.. ఏపీపీఎస్సీ పరీక్షలకు ప్రిలిమ్స్ రద్దు, త్వరలో 1184 పోస్టులకు నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇకపై ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు

APPSC Prelims : గుడ్ న్యూస్.. ఏపీపీఎస్సీ పరీక్షలకు ప్రిలిమ్స్ రద్దు, త్వరలో 1184 పోస్టులకు నోటిఫికేషన్‌

Appsc Prelims

APPSC Prelims : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇకపై ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రిలిమ్స్ పరీక్ష రద్దుకు సంబంధించి జీవోలు 39, 150 లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరామని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్ సలాంబాబు తెలిపారు.

గ్రూప్ వన్ పోస్టులకు మాత్రం ప్రిలిమ్స్ నిర్వహిస్తామని చెప్పారు. ఇక గ్రూప్ వన్ లో ఇంటర్వ్యూల స్థానంలో కొత్త విధానాన్ని అమలు చేసేలా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఆగస్టులో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఆగస్టు నుంచి ఏపీపీఎస్సీ అమలు చేస్తుందని ఆయన తెలిపారు. అయితే, అగ్రవర్ణ పేదలకిచ్చే రిజర్వేషన్లపై రోస్టర్ పాయింట్లను ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉందన్నారు.

అదే సమయంలో నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. 1,184 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సలాంబాబు ప్రకటించారు. అంతేకాదు ఉద్యోగాల భర్తీలో వయోపరిమితిని 47 ఏళ్ల వరకు పొడిగించాలన్న ప్రతిపాదనలని ప్రభుత్వానికి పంపామన్నారు. ఇక ఏపీ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ లో మార్పులు చేయాల్సి ఉందన్నారు. గతంలో ఏపీపీఎస్సీ కేంద్ర కార్యాలయం దగ్గర ఆందోళనల్లో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు సలాంబాబు తెలిపారు.

ఉద్యోగ నియామకాల అంశంపై స్పందించిన షేక్ సలాంబాబు.. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇప్పటివరకు గుర్తించిన ఖాళీల్లో గ్రూప్-1, గ్రూప్-2 సహా వివిధ విభాగాల పోస్టులు ఉన్నాయని వివరించారు. పోస్టులు పెంచుతూ వచ్చే నెల గ్రూప్స్ తో పాటు పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పారు. ఇక మీదట మూడు, నాలుగు నెలల్లోనే ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు.