Kakinada Tiger Tension : అమ్మో పులి.. మళ్లీ వచ్చింది.. ఆ ప్రాంతంలో భయం భయం

ఇప్పటివరకు ఏలేశ్వరం, శంఖవరం మండల వాసులను వణికించిన పెద్ద పులి ఇప్పుడు ప్రత్తిపాడు మండలంలోకి అడుగు పెట్టడంతో జనం భయపడుతున్నారు.

Kakinada Tiger Tension : అమ్మో పులి.. మళ్లీ వచ్చింది.. ఆ ప్రాంతంలో భయం భయం

Bengal Tiger Tension

Kakinada Tiger Tension : కాకినాడ జిల్లాను 27 రోజులుగా వణికిస్తున్న బెంగాల్ టైగర్.. ప్రత్తిపాడు మండలం శరభవరం వద్ద మళ్లీ ప్రత్యక్షమైంది. ఇప్పటివరకు ఏలేశ్వరం, శంఖవరం మండల వాసులను వణికించిన పెద్ద పులి ఇప్పుడు ప్రత్తిపాడు మండలంలోకి అడుగు పెట్టడంతో జనం భయపడుతున్నారు. ఇన్నాళ్లుగా యధేచ్చగా తిరుగుతున్నా అధికారులు పట్టుకోలేకపోవడంపై జనం మండిపడుతున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఓవైపు మూగజీవాలపై పంజా విసురుతున్న పెద్ద పులి ఎప్పుడు ఎక్కడ తమపై దాడి చేస్తుందోనని జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే, అటవీశాఖ అధికారులు మాత్రం పులిని పట్టుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి షూటర్లు, సాంకేతిక నిపుణులను రప్పిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే పులిని పట్టుకుంటామని చెబుతున్నారు.

Kakinada Tiger : అటవీ అధికారులను తిప్పలు పెడుతున్న పులి

దాదాపు నెల రోజులు కావొస్తోంది. ఇంకా.. పెద్ద పులి బోనుకి చిక్కడం లేదు. అధికారులు ఎన్ని వ్యూహాలు వేసినా అన్నింటినీ చిత్తు చేస్తోంది. చిక్కినట్టే చిక్కి మళ్లీ చేజారిపోతోంది. తిరిగిన చోట తిరగకుండా స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పులిని పట్టుకునేందుకు అటవీశాఖాధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. పులి తిరిగిన ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు కెమెరాలను ఏర్పాటు చేశారు.

Tiger escape: తృటిలో తప్పించుకుంది.. బోను దగ్గరకొచ్చి వెనుదిరిగిపోయిన పులి.. రెండు వారాలుగా ..

ఈ కెమెరాల్లో పులి తిరిగిన ఆనవాళ్లు రికార్డయ్యాయి. అటవీశాఖాధికారులు పులిని పట్టుకునేందుకు వేసిన ఎత్తులను చిత్తు చేస్తూ పులి తప్పించుకు తిరుగుతుంది. పులి.. ఆవులు, మేకలను చంపి తింటుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పెద్దపులి సంచారం భయంతో రైతులు పొలాలకు కూడా వెళ్లడం లేదు.

జిల్లాలోని పొదురుపాక, శరభవరం, ఒమ్మంగి, పాండవుల పాలెం తదితర ప్రాంతాల్లో పులి సంచరించినట్టుగా అధికారులు గుర్తించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. ఈ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసి పులి కోసం మాంసాన్ని కూడా ఎరగా వేశారు. అయితే బోను వద్దకు వచ్చినట్టే వచ్చిన పులి తిరిగి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను అక్కడే ఏర్పాటు చేసిన కెమెరాలలో రికార్డయ్యాయి. ఈ పులి సంచారంతో 11 గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. మే 25వ తేదీ నుండి పులి కోసం అధికారులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పరిసరాల్లో పులి సంచారం సీసీటీవీ పుటేజీలో రికార్డ్ అయ్యింది. గత నెల 29న ఈ దృశ్యాలను అధికారులు గుర్తించారు. పులి సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లాలోని పోతులూరు వద్ద పది పశువులను పులి చంపి తింది. దీంతో స్థానిక రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు.