Kakinada Tiger : అటవీ అధికారులను తిప్పలు పెడుతున్న పులి

గత 20 రోజులుగా కాకినాడ జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పులి తన స్ధావరాన్ని తరుచూగా మారుస్తోంది.

Kakinada Tiger : అటవీ అధికారులను తిప్పలు పెడుతున్న పులి

Kakinada Tiger

Kakinada Tiger :  గత 20 రోజులుగా కాకినాడ జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పులి తన స్ధావరాన్ని తరుచూగా మారుస్తోంది. తాజాగా ప్రత్తిపాడు మండలం ఉదరమెట్ట పరిసర ప్రాంతంలో పులి అడగుజాడలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఎక్కడెక్కడో తిరిగి మళ్లీ వొమ్మంగి, పోతులూరు సమీప ప్రాంతానికి చేరుకుందని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలు  ఇంట్లోంచి  అడుగు బయటపెట్టాలంటేనే భయపడి పోయే పరిస్ధితి వచ్చింది.

పులిని బందించటానికి సుమారు 120 మంది క్షేత్రస్ధాయి సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. మరో 30 మంది చీఫ్ కన్జర్వేటర్ నుంచి సెక్షన్ స్ధాయి అధికారి వరకు మరో 30 మంది పులి ప్రభావిత ప్రాంతాల్లో విధుల్లో ఉన్నారు. పులిని బంధించటానికి ఆత్మకూరునుంచి ఎన్ఎస్ఆర్టీ టీమ్ కూడా జిల్లాకువచ్చింది.

పులులను పట్టుకోవటంతో సిధ్దహస్తులైన నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ కు చెందిన 16 మంది కూడా పెద్దిపాలెం వచ్చారు. పులి బోను కు చిక్కకపోతే మత్తుమందు ఇచ్చేందుకు  వైల్డ్ లైఫ్ ప్రోటెక్షన్ అండ్ రెస్క్యూ టీమ్ ప్లాన్ చేస్తోంది.

అధికారుల అంచనాలకు అందకుండా పులి తప్పించుకుపోతోంది. ఇప్పటికే పులిని బంధించటానికి నాలుగు బోన్లు ఏర్పాటు చేశారు. వొమ్మంగి పరిసర ప్రాంతాలలో ఆవును చంపిన ప్రాంతంలో ఒక బోను, అదే ప్రాంతంలో రోడ్డు పై మరో బోనును ఏర్పాటు చేశారు. శరభవరం వెళ్లే మార్గంలో మరో బోను…ఉదరమెట్ట ప్రాంతంలో ఒక బోను ఏర్పాటు చేసిన అధికారులు బోనులో లేగ దూడలను ఎర గా పెట్టారు.

Also Read : TSRTC : రూట్ బస్‌పాస్ చార్జీలు భారీగా పెంచిన టీఎస్ఆర్టీసీ