Tiger escape: తృటిలో తప్పించుకుంది.. బోను దగ్గరకొచ్చి వెనుదిరిగిపోయిన పులి.. రెండు వారాలుగా ..

పత్తిపాడు మండలంలో రెండు వారాలుగా పులి అటవీ శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతుంది. దానిని పట్టుకొనేందుకు ఎన్ని ఉపాయాలు పన్నినా చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటుంది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే ఎదురైంది. పులిని పట్టుకొనేందుకు

Tiger escape: తృటిలో తప్పించుకుంది.. బోను దగ్గరకొచ్చి వెనుదిరిగిపోయిన పులి.. రెండు వారాలుగా ..

Tiger (1)

Tiger escape: పత్తిపాడు మండలంలో రెండు వారాలుగా పులి అటవీ శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతుంది. దానిని పట్టుకొనేందుకు ఎన్ని ఉపాయాలు పన్నినా చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటుంది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే ఎదురైంది. పులిని పట్టుకొనేందుకు అటవీశాఖ సిబ్బంది బోన్లు ఏర్పాటు చేశారు. అయితే శనివారం అర్థరాత్రి తరువాత శరభవరం వద్ద ఏర్పాటు చేసిన బోను వద్దకు పులి వచ్చింది. పులి బోనులోకి వెళితే చిక్కుకునేది. కానీ బోను ద్వారం వరకు వచ్చి వెనుదిరిగిపోయింది.

Tiger : స్థావరం మార్చిన పులి

కాకినాడ జిల్లా పత్తిపాడు మండలంలో దాదాపు రెండు వారాలుగా పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా పులి సంచరించిన దృశ్యాలు మరోసారి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పులిని పట్టుకొనేందుకు పొదురుపాక, శరభవరం, ఒమ్మంగిలో మూడు బోన్లు ఏర్పాటు చేసి పశు మాంసం ఎరగా వేశారు. ఆ ప్రాంతాల్లో పులి సంచరించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అయితే ఈ ప్రాంతాల్లో ఆహారం, వసతి సౌకర్యంగా ఉండటంతో పులి ఇక్కడే ఉండి వేటాడుతున్నట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.

Tiger : కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం-భయంతో వణుకుతున్న ప్రజలు

ఇదిలా ఉంటే పులి జాడలు సీసీ కెమెరాలలోె  రికార్డు అవుతుండటంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ సమయంలో మనుషులపై దాడి చేస్తుందోనన్న భయంతో బయటకు వచ్చేందుకు కూడా స్థానికులు సాహసించడం లేదు. అయితే పులిని సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలని అటవీశాఖ అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.