Tiger : కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం-భయంతో వణుకుతున్న ప్రజలు

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పెద్ద పులి సంచారంతో ప్రజలు భయంతో వణికి పోతున్నారు. ఒమ్మంగి, పోతులూరూ, మధ్య పంట పొలాల్లో పెద్దపులి తిరుగుతున్న వీడియోలు అటవీ శాఖ ఏర్పాటు చేసిని సీసీ కెమెరాలకు చిక్కాయి.

Tiger : కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం-భయంతో వణుకుతున్న ప్రజలు

tiger roaming

Tiger :  కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పెద్ద పులి సంచారంతో ప్రజలు భయంతో వణికి పోతున్నారు. ఒమ్మంగి, పోతులూరూ, మధ్య పంట పొలాల్లో పెద్దపులి తిరుగుతున్న వీడియోలు అటవీ శాఖ ఏర్పాటు చేసిని సీసీ కెమెరాలకు చిక్కాయి. దీంతో ప్రజలకు రాత్రి పూట కంటి మీదు కునుకు కరువయ్యింది. అక్కడ సంచరిస్తున్నది మగ పులిగా అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. పులిని బంధించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. పులి రాత్రిపూట పశువులపై దాడి చేస్తున్నట్లు గుర్తించారు.

ఇప్పటికే పులి ఒమ్మంగి, పోతులూరు, పొదురుపాక, శరభవరం, ధర్మవరం గ్రామాల్లో 10 గేదెలపై దాడి చేసింది. పోతులూరు వద్ద స్థానిక సర్పంచ్‌లతో ఉన్నతాధికారుల సమావేశం అయ్యారు. ఆదివారం సాయంత్రానికి పులిని బంధించేదుకు బోన్లను అడవిలో ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 120 మంది అటవీ సిబ్బంది పులిని పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. రైతులు, గ్రామస్తులు అటవీ ప్రాంతంలోకి వెళ్ళవద్దని అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పులిని బంధించేందుకు వారం రోజులు సమయం పట్టవచ్చని చీఫ్ ఫారెస్ట్ కన్సర్వేటర్ శరవణన్ తెలిపారు.