Somu Veerraju On BJP-TDP Alliance : టీడీపీ-బీజేపీ పొత్తుపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. టీడీపీతో బీజేపీ పొత్తు గురించి వస్తున్న ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చారు.(Somu Veerraju On BJP-TDP Alliance)

Somu Veerraju On BJP-TDP Alliance : టీడీపీ-బీజేపీ పొత్తుపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Somu Veerraju

Somu Veerraju On BJP-TDP Alliance : జనసేన ఆవిర్భావ సభలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ మారాయి. వైసీపీకి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా చీలిపోకుండా చూస్తానని పవన్ అన్నారు. దీంతో టీడీపీ, బీజేపీలను పవన్ తిరిగి దగ్గర చేస్తారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ, బీజేపీ పొత్తు గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. టీడీపీతో బీజేపీ పొత్తు గురించి వస్తున్న ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చారు. టీడీపీతో తాము పొత్తు కుదుర్చుకుంటామని ఎక్కడా చెప్పలేదని సోము వీర్రాజు అన్నారు. అదంతా కేవలం మీడియా కల్పితమేనని చెప్పారు. తమకు జనసేనతోనే పొత్తు ఉందని, ఆ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళతామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఇక, ఏపీలో ఎన్నికలకు సంబంధించి బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధమవుతోందని తెలిపారు.

Somu Veerraju: పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన “బీజేపీ రోడ్ మ్యాప్”పై స్పందించిన సోము వీర్రాజు

ఇటీవలే జనసేనాని పవన్ కళ్యాణ్…. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. పైగా, ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదన్నారు. దాంతో, బీజేపీ-జనసేన కూటమితో టీడీపీ కూడా కలుస్తుందేమోనన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, సోము వీర్రాజు తాజా వ్యాఖ్యలతో ఇప్పటివరకు పొత్తు ప్రతిపాదనలేవీ లేవన్న విషయం అర్థమవుతోంది.(Somu Veerraju On BJP-TDP Alliance)

కర్నూలులో బీజేపీ రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమంలో సోము వీర్రాజు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పటికే కేంద్రం ఇస్తున్న నిధులను సొంత అవసరాలకు వైసీపీ ప్రభుత్వం వాడేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. దీనిపై మరోసారి స్పందించిన సోము వీర్రాజు.. రాష్ట్రానికి కేంద్రం ఏం ఇచ్చిందో వైసీపీ మంత్రులతో బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు.(Somu Veerraju On BJP-TDP Alliance)

Pawan Kalyan: జగన్ పాలనలో జరిగింది.. జరిగేది ఇదే..! జనసేన ఆవిర్భావ సభలో విరుచుకుపడిన పవన్

వైసీపీ నవరత్నాలు కేంద్రం నిధులతో అమలు చేస్తున్నారని సోము ఆరోపించారు. ఏపీపై ప్రత్యేక ప్రేమతో కేంద్రం ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఇస్తోందన్నారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీతో ఎక్కువ నిధులు వచ్చాయని ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు జగన్ మాయలో పడి యూ టర్న్ తీసుకున్నారని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం నిధులతోనే నిర్మిస్తామని సోము వీర్రాజు చెప్పారు.

Somuveerraju : 2024లో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : సోమువీర్రాజు

2024లో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సోమువీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఆయన మరోసారి స్పష్టం చేశారు. వైసీపీ సర్కార్‌పై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపై గ్రామస్థాయి నుంచి ఉద్యమిస్తామని చెప్పారు.

Pawan Warning : వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్