Konaseema Tension : అంబేద్కర్ పేరుతో పచ్చని కోనసీమలో ప్రభుత్వం చిచ్చు పెట్టింది : జీవీఎల్

అంబేద్కర్ పేరుతో పచ్చని కోనసీమలో ప్రభుత్వం చిచ్చు పెట్టింది అని బీజేపీ నేత జీవీఎల్ విమర్శించారు.

Konaseema Tension : అంబేద్కర్ పేరుతో పచ్చని కోనసీమలో ప్రభుత్వం చిచ్చు పెట్టింది : జీవీఎల్

Konaseema Tension

Konaseema Tension : అమలాపురంలో ఉద్రిక్తత పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. కోనసీమ జిల్లా పేరు కొనసాగించాలంటూ భారీ ర్యాలీ నిర్వహిస్తున్న యువకులను పోలీసులు ఇప్పటికే అడ్డుకోవటంతో పోలీసులకు, యువకులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఎస్పీ వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి జరిపారు. ఈ దాడిలో ఓ పోలిస్‌కు గాయాలయ్యాయి. పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిస్థితులపై బీజేపీ నేత జీవిఎల్ స్పందించారు. కొత్త జిల్లాల పేరు విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి నిర్ణయం తీసుకుందని అందుకే పేర్లు విషయంలో ఇటువంటి వివాదాలకు కారణమయ్యిందని విమర్శించారు. అంబేద్కర్ పేరుతో పచ్చని కోనసీమలో ప్రభుత్వం చిచ్చు పట్టిందని ఆరోపించారు జీవీఎల్. అమలాపురంలో జిల్లా పేరు విషయంలో వివాదం విషయంలో తలెత్తిన ఉద్రిక్తత పరిస్థితులను కంట్రోల్ చేయటంలో ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు జీవీఎల్.

Also read : Konaseema Tension: పోలీసుల వలయంలో అమలాపురం.. అదుపులోకి వచ్చిన పరిస్థితులు..

కొత్త జిల్లాలకు పేర్లు పెట్టే విషయంలో ఒక పద్ధతి ప్రకారంగా వ్యవహరిస్తే కోనసీమలో ఇటువంటి పరిస్థితులు వచ్చి ఉండేవి కావని ఇటువంటి పరిస్థితులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఏపీలో ప్రభుత్వ పాలన అడ్డగోలుగా విఫలమైందని..వైఫల్యాలను మూటగట్టుకొనే ప్రభుత్వం జగన్ ది అని ఎద్దేవా చేవారు జీవీఎల్ నరసింహారావు. గుంటూరులో ఉన్న జిన్నా టవర్ పేరు మార్చాలని శాంతి యుతంగా నిరసన తెలిపితే బీజేపీ కార్యకర్తలపై దాడులు చేసి కేసులు పెట్టారని..అఖండ భారతదేశాన్ని విభజించి పాకిస్థాన్ ఏర్పడటానికి కారణమైన మహ్మద్ అలీ జిన్నా పై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ ఎందుకు? అని ప్రశ్నించారు.మనం ఏపీలో ఉన్నామా? పాకిస్ధాన్ లో ఉన్నామా? అని ప్రశ్నించారు.జిన్నా టవర్ దశాబ్దాలుగా ఉంది సరే కొనసాగాలని ఎక్కడైనా ఉందా? పాకిస్ధాన్ లోని వ్యక్తికి గుంటూరు లో టవర్ ఉండాల్సిన అవసరం ఏంటీ? అని ప్రశ్నించారు. ఈ విషయం లేవనెత్తితే బీజేపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడతారా? అటువంటి వైసీపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది అని అన్నారు.

Also read : Konaseema : సాంప్రదాయాలకు, మర్యాదలకు పుట్టినిల్లు కోనసీమ

రాష్ట్రంలో మైనార్టీ ఓట్లు దండుకోవాలనే తప్ప అందరు ప్రజలు సమసమానంగా ఉండాలని లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను ఇప్పటికైనా ఆపకపోతే బీజేపీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతుంది అని తెలిపారు.కొత్త కోనసీమ జిల్లాగా ఏర్పడి నెల కూడా కాకముందే అల్లర్లు ఇంత తీవ్రస్థాయంలో వెల్లువెత్తాయి అంటే అది కేవలం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. విధ్వంసకర బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ని ఇది రాష్ట్ర ప్రభుత్వ, పోలీసుల వైఫల్యం అని నొక్కి చెప్పారు.

Also read : Kottu Satyanarayana Allegations : కోనసీమ అల్లర్లు.. జనసేన, టీడీపీ కుట్రలో భాగమే -మంత్రి సంచలన ఆరోపణలు

ఎవరైనా నిరసనలు తెలిపే హక్కు ఉంటుంది. నిరసనలు శాంతియుతంగా పోరాడాలి తప్ప..విధ్వంసకర చర్యలు పాల్పడడం సరికాదు అని..అంబేద్కర్ పేరు మీద వివాదాన్ని ప్రభుత్వమే సృష్టించింది వైసిపి ప్రభుత్వమే కాబట్టి దేశ ప్రజలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత జీవీఎల్ డిమాండ్ చేశారు. అంబేద్కర్ పేరు పెట్టే విషయంలో ఆయా జిల్లా ప్రజల్లో చర్చ జరిపితే బాగుండేది ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండేవని.. అంబేద్కర్ జిల్లాను అపహాస్యం చేసింది ప్రభుత్వమే కనుక ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ మాట్లాడుతూ..‘‘కోనసీమలో హింస.. ప్రణాళిక ప్రకారమే జరిగిందని భావిస్తున్నాం. ఓ మంత్రికే ఇలా జరిగిందంటే ఏపీలో పరిస్థితి అర్థమవుతోంది. వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే ప్రభుత్వ పన్నాగంగా భావిస్తున్నాం. కోనసీమ కుట్రలో అధికార పార్టీ భాగస్వామ్యం ఉంది. వైకాపా నేతల్లో కొందరు దాడులను ప్రేరేపిస్తున్నారని విశ్వరూప్‌ స్పష్టం చేశారు. విశ్వరూప్‌ వ్యాఖ్యలు చూస్తే అధికార పార్టీ హస్తం ఉందని అర్థమవుతోంది. 7 నియోజకవర్గాల జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టి ఆ జిల్లాకే పరిమితం చేస్తారా? సీఎం జగన్‌ దావోస్‌ వెళ్లినా ఒక్క పైసా పెట్టుబడి కూడా ప్రత్యేకంగా రాలేదు అని విమర్శించారు.