Konaseema : సాంప్రదాయాలకు, మర్యాదలకు పుట్టినిల్లు కోనసీమ

కోనసీమ పదం మూల అంటే కోన, ప్రదేశం అంటే సీమ అనే పదాల నుండి కోనసీమ పదం ఏర్పడింది అని చరిత్ర చెప్తుంది...గోదావరి డెల్టా... చుట్టూ గోదావరి వృద్ధ గోదావరి, వశిష్ట గోదావరి, గౌతమి, నీలరేవు అనే పాయలుగా చీలిపోతుంది

Konaseema : సాంప్రదాయాలకు, మర్యాదలకు పుట్టినిల్లు కోనసీమ

Konaseema

Konaseema : కోనసీమ పదం మూల అంటే కోన, ప్రదేశం అంటే సీమ అనే పదాల నుండి కోనసీమ పదం ఏర్పడింది అని చరిత్ర చెప్తుంది…గోదావరి డెల్టా… చుట్టూ గోదావరి వృద్ధ గోదావరి, వశిష్ట గోదావరి, గౌతమి, నీలరేవు అనే పాయలుగా చీలిపోతుంది…రాజమండ్రి వరకు ఒకే పాయగా ఉన్న గోదావరి రాజమండ్రి నగరాన్ని దాటిన తరువాత వృద్ధ గోదావరి, వశిష్ట గోదావరి పాయలుగా చీలుతుంది… వృద్ధ గోదావరి గౌతమి, నీలరేవుగా…. వశిష్ట గోదావరి వశిష్ట, వైనతేయగా చీలుతుంది…. ఈ పాయలు మధ్య గోదావరి పరివాహక ప్రదేశాన్ని కోనసీమ ప్రాంతం అంటారు..

Godavari

కోనసీమలో అమలాపురం అతి పెద్ద పట్టణం.. తరువాత రాజోలు, రావులపాలెం, కొత్తపేట, ముమ్మిడివరం పట్టణాలు ఉన్నాయి….కోనసీమ మర్యాదలకు పుట్టిల్లు అంటారు… బంధువులను, చూసే చుట్టుపు చూపు, ఇచ్చే మర్యాద, పెట్టె విందు భోజనం, పిలిచే పిలుపు, అందరూ మన వాళ్ళు అనే భావాన్ని కలిగిస్తాయి… పండగలు, ఉత్సవాలు సమయంలో కుటుంబ సభ్యులతో ఇళ్లన్నీ కళకళలాడుతూ ఉంటాయి… నేటికీ ఉమ్మడి కుటుంబాలు కోనసీమలో ఉన్నాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు కోనసీమ ప్రత్యేకత, సాంప్రదాయాలకు, కట్టుబాట్లకు ఇచ్చే విలువ.

Konaseema House

ముఖ్యంగా కోనసీమను మరో కేరళగా పిలుస్తారు .. కోనసీమ మొత్తం అంతా గోదావరి నదీ పాయల మధ్య ఉండటం, అడుగు భూమి కూడా కాళీగా లేకుండా కొబ్బరి చెట్లు పెంచడంతో ఇక్కడ వాతావరణం కూడా నిత్యం చల్లగా ఉంటుంది… కోనసీమలో కొబ్బరి చెట్టును సొంత కొడుకులా చూస్తారు… ఇక్కడ ప్రజల ప్రధాన ఆదాయం కొబ్బరి కావడంతో పచ్చని పొలాలు, నిటారుగా కనిపించే కొబ్బరి చెట్ల మధ్య కోనసీమ పచ్చని సీమగా కనిపిస్తుంది.

Coconut

ముఖ్యంగా కోనసీమలో కొబ్బరికి ఎంత పంటకు డిమాండ్ ఉంటుందో గ్యాస్ కి కూడా అంతే డిమాండ్ ఉంటుంది… కేజీ బేసిన్ లో విరివిగా గ్యాస్ నిక్షేపాలు ఉండటం ఒక ప్రత్యేకత..గతంలో 30 సంవత్సరాల క్రితం కోనసీమలో పాసర్లపూడి లో గ్యాస్ బ్లో అవుట్ ఏర్పడటంతో కోనసీమ పేరు దేశ విదేశాల్లో సైతం తెలిసింది.

Konaseema Banana

1996లో వచ్చిన తుఫాన్ కోనసీమ రూపురేఖలను మార్చేసింది… తర్వాత కోనసీమ సాధారణ స్థాయికి రావడానికి 15 సంవత్సరాలు పట్టింది.  కోనసీమ ప్రాంతం గోదావరి నదీ పాయల మధ్య ఉండటం, సముద్ర తీరం కోనసీమను ఆనుకుని ఉండటం ఇక్కడ అభివృద్ధికి దోహద పడుతుంది..కోనసీమకు తలమానికంగా ఉన్న అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది… కోనసీమలో సంస్కృతి, సాంప్రదాయాలు పెట్టింది పేరు… ఇలాంటి కోనసీమలో ఈ విధమైన విధ్వంసకరమైన దాడులను ఎవ్వరూ ఊహించరు.