AP BJP : రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చకు రావాలి సోము వీర్రాజు సవాల్

ఏపీ రాజధానిగా అమరావతి అని కేంద్ర ప్రభుత్వం భావించి కోట్లాది రూపాయాలు నిధులు కేటాయించడం జరిగిందని...

AP BJP : రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చకు రావాలి సోము వీర్రాజు సవాల్

Bjp Ap

BJP President Somu Veerraju : ఏపీ రాష్ట్రంలో అప్పులు పెరిగాయి..లక్షల కోట్లు అప్పు చేసే హక్కు మీకు ఎవరిచ్చారు ? రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై చర్చకు రావాలని…రాష్ట్ర ఆర్థిక మంత్రికి సవాల్ విసురుతున్నట్లు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఆర్థిక సంఘం నిదులను పక్కదారి పట్టిస్తూ అభివృద్ధికి అడ్డుగా మారిన సీఎం జగన్ కూడా బహిరంగ చర్చకు రావాలన్నారు. 2021, డిసెంబర్ 04వ తేదీ శనివారం ఉదయం రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రాష్ట్రంలో అస్సలు అభివృద్ధి లేదని, ప్రజల ఆస్తులు అమ్మకం..తాకట్టు పెట్టడం తప్ప ఏమన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. స్టిక్కర్ల పథకాలు తప్పితే సొంత పథకాలు ఏమన్నా ఉన్నాయా అని ఎద్దేవ చేశారు. రాష్ట్ర ప్రజల మానసిక క్షోభకు సీఎం జగన్ కారణమని విమర్శించారు.

Read More : Vegetables for Telangana: ఏడాదికి తెలంగాణకు కావాల్సిన కూరగాయలు

రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఆయన తప్పుబట్టారు. ఏపీ రాజధానిగా అమరావతి అని కేంద్ర ప్రభుత్వం భావించి కోట్లాది రూపాయాలు నిధులు కేటాయించడం జరిగిందని, అమరావతి చుట్టూ ఫ్లైఓవర్స్, రహదారుల నిర్మాణాలు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. రాజధానిపై ఇతర పార్టీలకంటే బీజేపీకే పేటెంటు హక్కు ఉందన్నారు. గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కానీ అమరావతికి ఎన్ని నిధులు కేటాయించాయో.. బీజేపీ ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో..చర్చించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తామే చేస్తున్నట్లు డబ్బా కొడుతోందని విమర్శించారు. 35 రకాల సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందనే విషయాన్న ఆయన ప్రస్తావించారు.

Read More : Covid-19 : అనారోగ్యంతో మావోయిస్టు అగ్రనేతలు..లొంగిపోతే ప్రాణాలు కాపాడతామంటున్న పోలీసులు

సంక్షేమ పధకాల అమలుపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే దమ్ము దైర్యం సీఎం జగన్ కు లేదన్నారు. 60 లక్షల మంది కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఘనత మోదీకి దక్కుతుందన్నారు. స్థానిక సంస్థల‌ నిధులు, NRGS నిధులతో గ్రామాల్లో అభివృద్ధి మానేసి ఇష్టానుసారంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఇసుక కాంట్రాక్టర్ల కోసం నిబంధనలు పాటించకపోవడం మూలంగా..అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిపోయిందన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు, పాల ఫ్యాక్టరీ నష్టాలు పేరిట ప్రైవేటు పరం చేస్తూ.. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేని ఆదరిస్తునట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు.