Black Magic : డోన్‌లో క్షుద్రపూజల కలకలం
కర్నూలు జిల్లా డోన్‌లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. సోమవారం అర్ధరాత్రి సమయంలో క్షుద్రపూజలు జరిగినట్లు గ్రామస్తులు గుర్తించారు.

Dhone Black Magic
Black Magic : కర్నూలు జిల్లా డోన్‌లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. సోమవారం అర్ధరాత్రి సమయంలో క్షుద్రపూజలు జరిగినట్లు గ్రామస్తులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు పంట పొలాల్లోకి వెళ్లే మార్గంలో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్ళను చూసిన రైతులు ఆందోళన చెందారు.
ఘటనా స్ధలంలో నల్లకోడిని బలి ఇచ్చిన రక్తపు ఆనవాళ్లు కనిపించాయి. ముగ్గులతో అమ్మవారి రూపము వేసి ఉంది…. అక్కడ పూజ చేసిన కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, నూనె, టెంకాయలను రహదారికి అడ్డంగా పడేశారు.
Also Read : Weather Forecast : ఏపీ లో రానున్న రెండురోజుల్లో వర్షాలు
పంట పొలాల్లోకి వెళ్లే మార్గంలో క్షుద్రపూజల చేసిన ఆనవాళ్లు ఉండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు భయాందోళనకు గురవుతున్నారు. గుప్త నిధుల కోసమా…. లేక చేతబడి చేయడానికి క్షద్రపూజలు చేశారా అని రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.