Weather Forecast : ఏపీ లో రానున్న రెండురోజుల్లో వర్షాలు

ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది

Weather Forecast : ఏపీ లో రానున్న రెండురోజుల్లో వర్షాలు

Rains in costal andhra

Updated On : December 29, 2021 / 8:06 AM IST

Weather Forecast :  ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. బంగాళాఖాతం మీదుగా కోస్తా పైకి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో మంగళవారం కోస్తా, రాయలసీమల్లో దట్టంగా మంచు కురిసింది.

ఉదయం పది గంటల వరకు మంచు ఏర్పడటంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తూర్పు గాలులు, మంచు ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఆరోగ్యవరంలో 15.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
Also Read : Hyderabad : ఆఫీసులోకి వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అదృశ్యం
రానున్న రెండు రోజుల్లో తూర్పుగాలులు మరింత బలపడే అవకాశముందని.. ఈ నెల 30 నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.