Kurnool : కర్నూలు జిల్లాలో దారుణం-బాలుడి సజీవ దహనం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నంద్యాల మండలం పాండు రంగాపురంలో ఒకబాలుడ్ని దుండగులు సజీవ దహనం చేశారు. సజీవదహనం అయిన బాలుడు ఎవరనేది ఇంకా తెలియలేదు.

Kurnool : కర్నూలు జిల్లాలో దారుణం-బాలుడి సజీవ దహనం

Kurnool

Updated On : April 4, 2022 / 9:44 PM IST

Kurnool : ఉమ్మడి కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నంద్యాల మండలం పాండు రంగాపురంలో ఒకబాలుడ్ని దుండగులు సజీవ దహనం చేశారు. సజీవదహనం అయిన బాలుడు ఎవరనేది ఇంకా తెలియలేదు.

కాగా గతనెల 30న ఇదే గ్రామానికి చెందిన సూర్య అనే బాలుడు ఆదృశ్యమయ్యాడు. అంగన్వాడీ స్కూలుకు వెళ్లిన తన కుమారుడు ఇంటికి తిరిగి రాలేదని బాలుడి తల్లి మాధవి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సజీవ దహనమైన బాలుడు, ఆదృశ్యమైన బాలుడు ఇద్దరూ ఒక్కరేనా,  లేక  వేరే  బాలుడా  అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ద్వారా పోలీసులు ఆధారాలు  సేకరిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read : Pudding And Mink Pub : ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్‌, బార్ లైసెన్స్ ర‌ద్దు చేసిన ఎక్సైజ్ శాఖ