Mobile Phone Games : వామ్మో.. 3 నెలలుగా మొబైల్‌లో గేమ్స్ ఆడి మతిస్థిమితం కోల్పోయాడు

కొందరు మొబైల్ ఫోన్ కి బానిసలుగా మారుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేదు. తిండి కూడా మాని నిత్యం ఫోన్ తోనే గడుపుతున్నారు. ఈ క్రమంలో పిచ్చోళ్లుగా మారుతున్నారు.

Mobile Phone Games : వామ్మో.. 3 నెలలుగా మొబైల్‌లో గేమ్స్ ఆడి మతిస్థిమితం కోల్పోయాడు

Mobile Phone Games

Mobile Phone Games : మొబైల్ ఫోన్.. ఇప్పుడు అందరి జీవితంలోనూ ఓ భాగమైపోయింది. చిన్న, పెద్ద.. ధనిక, పేద అనే తేడా లేదు. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. చాలావరకు పనులన్నీ ఫోన్ లోనే అయిపోతున్నాయి. కరోనా పుణమ్యా అని.. ఆన్ లైన్ క్లాసులు వచ్చాక ఫోన్ల వినియోగం మరింతగా పెరిగిపోయింది. చిన్నారులకు కూడా ఫోన్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఏదైనా లిమిట్ లో ఉన్నంతవరకు ఎలాంటి నష్టం లేదు. ఆ లిమిట్ క్రాస్ అయితే కష్టాలు తప్పవు. భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.

కొందరు కుర్రాళ్లు మొబైల్ ఫోన్ కి బానిసలుగా మారుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేదు. తిండి కూడా మాని నిత్యం ఫోన్ తోనే గడుపుతున్నారు. మొబైల్ చూడటం, ఫోన్ లో గేమ్స్ ఆడటమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో కొందరు మతిస్థిమితం కోల్పోతున్నారు. పిచ్చోళ్లుగా మారుతున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు అనేకం చూశాం. తాజాగా అలాంటి ఇన్సిడెంట్ మరొకటి చోటు చేసుకుంది.

Mukesh Ambani: భారత్ లోనే అత్యంత ఖరీదైన కారును సొంతం చేసుకున్న ముకేశ్ అంబానీ

అనంతపురం జిల్లా కణేకల్లు మండలం బెణకల్లుకు చెందిన మహేశ్(19) అనే యువకుడు మొబైల్ కు బానిసై మతిస్థిమితం కోల్పోయాడు. ఇంటర్ మధ్యలో ఆపేసిన మహేశ్.. కూలి పనులకు వెళ్తున్నాడు. అలా వచ్చిన డబ్బుతో ఫోన్ కొన్నాడు. ఆ తర్వాత పనులు మానేసి ఇంట్లోనే ఉంటూ ఫోన్ లో పబ్జీ తరహా గేమ్స్ ఆడటం మొదలుపెట్టాడు. క్రమంగా దానికి బానిసగా మారాడు. అతడు దానికి ఎంతగా అడిక్ట్ అయిపోయాడంటే.. చివరికి సరైన ఆహారం తినలేదు. కంటి నిండా నిద్రపోలేదు.

ఇలా మూడు నెలులు.. రాత్రీ పగలు.. నిద్రాహారాలు మాని మరీ స్మార్ట్ ఫోన్ లోనే మునిగిపోయాడు. గేమ్స్ ఆడుతూనే ఉన్నాడు. ఇది అతడి ఆరోగ్య పరిస్థితిపై తీవ్రమైన ప్రభావమే చూపింది. మహేష్ ఆరోగ్యం క్షీణించింది. చివరికి మతిస్థిమితం కోల్పోయాడు. ఇప్పుడు అతడి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఏం మాట్లాడుతున్నాడో అతడికే తెలీదు. ఎదుటి వారు ఏం చెబుతున్నారో కూడా తెలుసుకోలేని స్థితికి చేరాడు. కొడుకు దుస్థితి చూసి తల్లిదండ్రులు తల్లిడిల్లుతున్నారు. మహేష్ కి దెయ్యం పట్టిందేమోనని భావించి మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లారు. అయినా లాభం లేకపోయింది. ఆ తర్వాత అతడిని డాక్టర్ కి చూపించారు. మొబైల్ ఫోన్ కి బానిసగా మారడం వల్లే మహేష్ ఇలా అయ్యాడని డాక్టర్ తెలిపారు.

Worst Passwords: ఈ పాస్‌వర్డ్‌లు పెట్టుకున్నారా? వెంటనే మార్చుకోండి.. సెకన్లలో హ్యాక్ చేసేస్తారు

పిల్లలు అడగ్గానే తల్లిదండ్రులు వారికి స్మార్ట్ ఫోన్ కొనివ్వడం గొప్ప సంగతి కాదు. ఫోన్ లో వారు ఏం చేస్తున్నారు? దేనికి వాడుతున్నారు? దాంతో ఎంత సేపు గడుపుతున్నారు? ఇలాంటి వాటిపై కచ్చితంగా తల్లిదండ్రులు నిఘా పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే పిల్లలను సరిదిద్దాలన్నారు. పరిస్థితి చేయి దాటకపోక ముందే తల్లిదండ్రులు అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం లేదన్నారు.