Casino Controversy : గవర్నర్ దృష్టికి కాసినో వ్యవహారం.. టీడీపీ నేతల ఫిర్యాదు

కాసినో నిర్వహణపై డీజీపీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. మంత్రి కొడాలి నానిని రక్షించేందుకు సీఎంతో సహా అందరూ తపన...

Casino Controversy : గవర్నర్ దృష్టికి కాసినో వ్యవహారం.. టీడీపీ నేతల ఫిర్యాదు

Casino

Casino Controversy Reaches To Raj Bhavan : గుడివాడ కాసినో నిర్వహణ ఇంకా సద్దుమణగలేదు. వైసీపీ, టీడీపీ పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గుడివాడలో పర్యటన అనంతరం మరింత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో..టీడీపీ నిజనిర్ధారణ కమిటీ 2022, జనవరి 27వ తేదీ గురువారం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిశారు. కాసినో వ్వవహారంపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ…కాసినో నిర్వహణపై డీజీపీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. మంత్రి కొడాలి నానిని రక్షించేందుకు సీఎంతో సహా అందరూ తపన పడుతున్నారని…ఇక చేసేది లేక తాము గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.

Read More : Mouni Roy : గోవాలో ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న నాగిని బ్యూటీ

గవర్నర్ అస్వస్థతకు గురైనందున ఆయన కార్యదర్శి సిసోడియాకు తాము ఫిర్యాదు, సాక్ష్యాలు అందచేయడం జరిగిందన్నారు. పేద, మధ్య తరగతి వాళ్లు జూదం ఆడడం కోసం ఓ టెంటు ఏర్పాటు చేశారని, రూ. 10 వేలు కట్టే వారికి కాసినో ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. కొడాలి నాని కాసినో నానిగా మారి రాష్ట్రంలో విష సంస్కృతికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా. గుడివాడ కాసినోను ప్రపంచమంతా చూసినా సీఎం జగన్ చూడలేకపోతున్నారని విమర్శించారు. డీజీపీ చూసి కూడా చూడనట్లు నటిస్తున్నారని, ఆధారాలు బయటపెడితే కొడాలి నాని సూటిగా సమాధానం చెప్పలేక తమల్ని అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని వెల్లడించారు.

Read More : Case Against Google CEO: గూగుల్ సీఈఓకు షాక్.. కాపీ రైట్ కేసు నమోదు

మరోవైపు..టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. కాసినో వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని లేఖలో డిమాండ్ చేశారు. దీనికి బాధ్యులైన మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. తాజాగా టీడీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేయడంపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.