Caste Discrimination : ప్రభుత్వ స్కూల్‌లో కుల వివక్ష.. అగ్ని కుల క్షత్రియ, అగ్ర కుల విద్యార్థులకు వేర్వేరుగా పాఠశాలలు

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం బ్రహ్మపురి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కులవివక్ష కలకలం రేగింది. స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులను కులాల పేరిట విభజించారు.

Caste Discrimination : ప్రభుత్వ స్కూల్‌లో కుల వివక్ష.. అగ్ని కుల క్షత్రియ, అగ్ర కుల విద్యార్థులకు వేర్వేరుగా పాఠశాలలు

School (1)

Caste discrimination in government school : శాస్త్ర, సాంకేతికరంగాల్లో దేశం దూసుకుపోతున్నా.. అంతరిక్షంలోకి రాకెట్లను పంపిస్తున్నా.. కుల వివక్ష మాత్రం పోవడం లేదు. ‘అంటరానితనం అమానుషం.. అంటరానితనాన్ని పాటించడం నేరం’.. అని పాఠ్యపుస్తకాలపై రాసివున్నా.. అవి పుస్తకాలకే పరిమితమయ్యాయి. ఎక్కడైతే కుల, మత బేధాలు లేకుండా విద్యార్థులంతా కలిసి చదువుకుంటారో అక్కడే కుల వివక్ష తాండవిస్తోంది. విద్యార్థులను కులాల వారిగా విభజించడం సిగ్గుచేటు. సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతి కొలువై ఉండే విద్యాలయంలోనే కుల వివక్ష ఘటన వెలుగుచూసింది. అది కూడా విద్యాశాఖ అధికారులు పాటించడం తీవ్ర కలకలం రేపుతోంది.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం బ్రహ్మపురి గ్రామంలోని.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కులవివక్ష కలకలం రేగింది. అగ్నికుల క్షత్రియ విద్యార్థులందరికీ ఒక పాఠశాల.. మిగతా విద్యార్థులందరికీ మరో పాఠశాలను మండల విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. దీనిపై అగ్నికుల క్షత్రియుల సంఘ నాయకులు భగ్గుమంటున్నారు. గ్రామ సర్పంచ్‌ సూచనల మేరకు విద్యార్థులను కుల విభజన చేశారంటూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

Gangaram Matham : ఆ భూములన్నీ టీటీడీవే.. గంగారాం మఠం పిటిషన్‌ ను కొట్టివేసిన కోర్టు

ఇంతకముందు బ్రహ్మపురిలో 52 మంది విద్యార్థులతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కొనసాగింది. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 9 లక్షలతో అన్ని మౌలిక వసతలతో స్కూల్‌ను ఆధునీకరించింది. అయితే రాజకీయ నాయకుల జోక్యంతో స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులను కులాల పేరిట విభజించారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

ఎలాంటి సదుపాయాలు లేని స్కూల్‌కు 26 మంది విద్యార్థులను పంపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రామంలో ఒకే పాఠశాల కొనసాగాలని తల్లిదండ్రులు, అగ్నికుల క్షత్రియుల సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులందరూ ఒకే పాఠశాలలో చదివే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.