YS Viveka : వైఎస్ వివేకా హత్య కేసు… సీబీఐ ఛార్జిషీటులో ఏముందంటే…

వివేకా హత్య కేసులో ఈ ఏడాది జనవరి 31న పులివెందుల కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. వివేకాను హత్య చేయడానికి 2019 ఫిబ్రవరి 10న ఎర్రగంగిరెడ్డి ఇంట్లో ప్రణాళిక రచించారని..

YS Viveka : వైఎస్ వివేకా హత్య కేసు… సీబీఐ ఛార్జిషీటులో ఏముందంటే…

Ys Vivekananda Reddy Murder Case

YS Viveka : ఏపీలో సంచలనం రేపిన మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివేకా హత్య కేసులో ఈ ఏడాది జనవరి 31న పులివెందుల కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. గతేడాది అక్టోబర్ 26న వేసిన ఛార్జిషీట్ తో పాటు 5వ నిందితుడిగా దేవిరెడ్డి శంకర్ రెడ్డికి సంబంధించిన వివరాలను పొందుపరుస్తూ చార్జిషీట్ దాఖలు చేసింది.

వివేకా హత్య కేసులో నలుగురు వ్యక్తులను నిందితులను చేరుస్తూ సీబీఐ ఛార్జిషీట్ వేసింది. ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి పేర్లను ఛార్జిషీట్ లో చేర్చింది. వివేకా హత్య జరిగిన రోజు ఘటనకు సంబంధించిన ఆధారాలు, వివరాలు లేకుండా చేయడంలో పలువురి పాత్రపై ఇందులో సీబీఐ ప్రస్తావించింది. వివేకా గుండెపోటుతో చనిపోయాడని ప్రచారం చేయడంలో దేవిరెడ్డి శంకర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సీబీఐ తెలిపింది. గుండెపోటుతో చనిపోయాడనే విషయాన్ని ప్రాపగాండ చేయడంలో శివశంకర్ రెడ్డి పాత్ర ఉన్నట్లు సీబీఐ తెలిపింది.

Jagananna Chedodu Scheme : రూ.10వేలు రాలేదా? మార్చి 11లోపు ఇలా చేయండి…

ఎర్రగంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి సూచనల మేరకు బెడ్ రూం, బాత్ రూంలను పని మనుషులు శుభ్రం చేశారని సీబీఐ పేర్కొంది. పోస్టుమార్టం నివేదికలో వివేకాకు ఏడు చోట్ల బలమైన గాయాలు ఉన్నట్లు ఛార్జిషీట్ లో సీబీఐ వెల్లడించింది. వివేకాను హత్య చేయడానికి ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి ఇంట్లోకి వెళ్లారంది. వివేకాను హత్య చేయడానికి 2019 ఫిబ్రవరి 10న ఎర్రగంగిరెడ్డి ఇంట్లో ప్రణాళిక రచించారని తెలిపింది.

బెంగళూరులో రూ.8 కోట్ల స్థలం సెటిల్ మెంట్, డబ్బు పంపకాల్లో వివేకా, ఎర్రగంగిరెడ్డికి మధ్య విబేధాలు ఏర్పడినట్టు సీబీఐ ఛార్జిషీటులో వెల్లడించింది. వివేకాను హత్య చేస్తే శివశంకర్ రెడ్డి రూ.40 కోట్లు సుపారీ ఇస్తారని ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడంది. మన వెనుక శివశంకర్ రెడ్డి ఉన్నాడని ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చినట్లు ఛార్జిషీటులో సీబీఐ ప్రస్తావించింది.

మరోవైపు వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ మొదలైంది. కడప జిల్లా పులివెందుల ఆర్‌ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ముగ్గురు అనుమానితులు సీబీఐ విచారణకు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా సాక్షి విలేకరి బాలకృష్ణారెడ్డిని అధికారులు విచారించారు. వివేకా హత్య జరిగిన సమయంలో బాలకృష్ణారెడ్డి కడప సాక్షి విలేకరిగా చేశారు. వివేకా గుండె పోటుతో చనిపోయారని బాలకృష్ణారెడ్డికి.. శివశంకర్‌రెడ్డి ఫోన్‌ చేసి చెప్పారు. ఈ కేసు విషయంలో ఇప్పటివకే పలుమార్లు బాలకృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

Drinking Water : పరగడుపున నీళ్లు తాగితే బోలెడు ప్రయోజనాలు

బాలకృష్ణారెడ్డితో పాటు యురేనియం కర్మాగారంలో పనిచేస్తున్న ఉదయ్‌కుమార్‌రెడ్డిని అధికారులు ప్రశ్నించారు. రెండు రోజుల క్రితమే కర్మాగారానికి వెళ్లి ఉదయ్‌ గురించి సీబీఐ అధికారులు ఆరా తీశారు. వివేకా మృతదేహానికి ఉదయ్‌ తండ్రి ప్రకాశ్‌రెడ్డి కుట్లు వేశారనే అభియోగాలున్న నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వీరిద్దరితో పాటు పులివెందుల ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో పనిచేస్తున్న డా.మధుసూదన్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు.