Sankranthi Wishes: తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు..!

తెలుగు ప్రజలకు రాజకీయ ప్రముఖులు భోగి, సంక్రాంతి పండగల శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆనందంగా ఉండాలని తమ సందేశాల్లో ఆకాంక్షించారు.

Sankranthi Wishes: తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు..!

Modi

Updated On : January 14, 2022 / 11:25 AM IST

Sankranthi Wishes: తెలుగు లోగిళ్లు.. సంక్రాంతి కళతో శోభాయమానంగా మారాయి. భోగి మంటలతో వేడుకలు రంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా.. కుటుంబాలతో కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతటి ఆనందకర సమయాన్ని.. ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మరింత ప్రత్యేకంగా మారుస్తున్నారు. భోగి మంటల్లో కరోనా కష్టాలు మాడిపోవాలని.. ప్రజలంతా ఆనందకరమైన జీవితాన్ని అనుభవించాలని కోరుతున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, తెలంగాణ మంత్రి హరీష్ రావ్ సహా.. మరింత మంది ప్రముఖులు.. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.