Vizag Steel Plant : రూ.900కోట్ల లాభం.. అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో మార్పు లేదు -తేల్చి చెప్పిన కేంద్రం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. లాభాలు వస్తున్నాయి అంటూనే ప్రైవేటీకరణకే మొగ్గు చూపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా 913.19 కోట్ల రూపాయల లాభం వచ్చిందని కేంద్రమే వెల్లడించడం గమనార్హం.

Vizag Steel Plant : రూ.900కోట్ల లాభం.. అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో మార్పు లేదు -తేల్చి చెప్పిన కేంద్రం

Steelplant

Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. లాభాలు వస్తున్నాయి అంటూనే ప్రైవేటీకరణకే మొగ్గు చూపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా 913.19 కోట్ల రూపాయల లాభం వచ్చిందని కేంద్రం వివరించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించినప్పటి కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించొద్దని రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి అనేకసార్లు విజ్ఞప్తి చేసింది. అయితే పెట్టుబడులు ఉపసంహరణలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తున్నట్లుగా మరోసారి కేంద్రం తేల్చి చెప్పింది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం వెనుక ఉమ్మడి ఆంధ్రుల కష్టమేంటో తెలుసా..

విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమైక్య రాష్ట్ర ప్రజలు చాలా పెద్ద పోరాటం చేశారని, ఆ ఉద్యమంలో 32 మంది అమరులయ్యారని కార్మిక సంఘాల నేతలు చెప్పారు. స్టీల్ ప్లాంట్.. ప్రత్యక్షంగా 32వేల మందికి, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పించిందని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. సుమారు రూ.3 లక్షల కోట్ల విలువ చేసే ఉక్కు పరిశ్రమ, దానికి అనుబంధంగా ఉండే వేల ఎకరాల భూములను కేవలం రూ.32 వేల కోట్లకు పోస్కో కంపెనీకి ధారాదత్తం చేయడానికి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ఆరోపణలు చేశారు.

Vizag Steel Plant : లాభాల బాటలో విశాఖ ఉక్కు

దేశ ప్రజల విలువైన ఆస్తులను కారుచౌకగా అమ్మేయడమే దేశభక్తా? అని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నించారు. కార్పొరేట్ల సేవలో భాగంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక సంస్కరణలను మరింత వేగంగా అమలు చేస్తోందని మండిపడ్డారు. బ్రిటీష్‌ కాలం నుండి దేశంలోని కార్మికవర్గం అనేక పోరాటాల ద్వారా, త్యాగాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేస్తూ వాటి స్థానంలో నాలుగు లేబర్‌ కోడ్లను పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ లేకుండా తన మంద బలంతో ఆమోదింప చేసిందని విమర్శించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

పాత కార్మిక చట్టాల్లో కార్మికులకు ఉండే అంతో ఇంతో ప్రయోజనాన్ని కూడా ప్రస్తుత లేబర్‌ కోడ్లలో తొలగించేసిందన్నారు. కార్మిక శాఖకు ఎగ్జిక్యూటివ్‌ అధికారాలను తొలగించిందన్నారు. కోరల్లేని తాచు లాంటి లేబర్‌ కోడ్లు అలంకారప్రాయమే తప్ప ప్రయోజనం శూన్యమని కార్మిక సంఘాల నేతలు అన్నారు.