నిధులు మాత్రమే ఇస్తాం, పునరావాసంతో సంబంధమే లేదు.. పోలవరంపై బాంబు పేల్చిన కేంద్రం

  • Published By: naveen ,Published On : October 26, 2020 / 12:48 PM IST
నిధులు మాత్రమే ఇస్తాం, పునరావాసంతో సంబంధమే లేదు.. పోలవరంపై బాంబు పేల్చిన కేంద్రం

polavaram project: పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం బాంబు పేల్చింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి మాత్రమే నిధులు ఇస్తామని చెప్పింది. పునరావాసంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. పోలవరంపై ఆర్టీఐ ద్వారా ఈ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.




2016 సెప్టెంబర్ నాటికి కేంద్రం ఆర్థిక శాఖ మెమో ప్రకారం పోలవరం నిర్మాణ నిధులు మాత్రమే కేంద్రం భరిస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.8వేల 614 కోట్లు మంజూరు చేసింది కేంద్రం. కేంద్రం నుంచి రూ.950 కోట్లు, నాబార్డు నుంచి 7వేల 665 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. కాగా, ఇప్పటివరకు కేవలం 20శాతం పునరావాసం పూర్తి అయ్యింది.



పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్‌ కాంపొనెంట్‌కు అయ్యే వందశాతం ఖర్చును తామే భరిస్తామని కేంద్రం ప్రకటించింది. ఆర్‌టీఐ యాక్ట్‌ ప్రకారం దాఖలైన పిటిషన్‌కు కేంద్రం సమాధానం ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు పనులకు ఎప్పుడెప్పుడు ఎంతెంత నిధులు విడుదల చేసింది వెల్లడించింది. 2013-14 లెక్కల ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం 29వేల కోట్లని తెలిపింది. 2017-18 ధరల ప్రకారం ప్రాజెక్టు వ్యయం 47వేల 725 కోట్లుగా తెలిపింది. కేంద్ర ప్రభుత్వం మూడేళ్లలో 950 కోట్లు విడుదల చేసిందని వెల్లడించింది. నాబార్డ్‌ నుంచి కూడా నిధులు ఇచ్చామని తెలిపింది. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని ప్రకటించింది. పోలవరం అథారిటీ సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తోందని ఈ RTI రిపోర్టులో పాల్గొన్నారు.