AP New Districts : ఏపీలో కొత్త జిల్లాలకు కోడ్‌.. ఇక ఈ కోడ్ ద్వారానే కార్యక్రమాలన్నీ అమలు!

AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల పాలన మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 72 రెవిన్యూ డివిజన్‌లతో 26 జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

AP New Districts : ఏపీలో కొత్త జిల్లాలకు కోడ్‌.. ఇక ఈ కోడ్ ద్వారానే కార్యక్రమాలన్నీ అమలు!

Ap New Districts Central Govt Assigns Lgd Codes To New Districts Formed In Andhra Pradesh State

AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల పాలన మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 72 రెవిన్యూ డివిజన్‌లతో 26 జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 13 కొత్త జిల్లాల్లో అధికారులు, ఉద్యోగులు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. స్థానిక ప్రభుత్వాలకు మ్యాపింగ్ చేసేందుకు వీలుగా ఈ కొత్త L.G.D కోడ్‌లను కేటాయించింది. పంచాయత్‌ ఈ-పంచాయత్‌ మిషన్‌ మోడ్‌ కింద ఎంటర్‌ప్రైజ్‌ సూట్‌ (PES‌) పేరుతో రూపొందించే అప్లికేషన్లలో ఈ కోడ్స్ వినియోగించనున్నారు.

కొత్త జిల్లాలకు కేటాయించిన ఈ కోడ్‌ వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లాకు 743, అనకాపల్లికి744, అల్లూరి సీతారామరాజు 745, కాకినాడ 746, కోనసీమ 747, ఏలూరు 748, ఎన్టీఆర్‌ 749, బాపట్ల 750, పల్నాడు 751, తిరుపతి 752, అన్నమయ్య 753, శ్రీసత్యసాయి 754, నంద్యాల 755 జిల్లా కోడ్ లను కేంద్ర కేటాయించింది. ఇక ఉమ్మడి జిల్లాలకు 502 కోడ్ నుంచి 521 కోడ్ వరకు జిల్లా లోకల్ గవర్నమెంట్ కోడ్ లను కేటాయించారు. కేంద్రం రాష్ట్రాలతో పాలనపరంగా సంప్రదింపులు జరపడంతో పాటు వివిధ పథకాలకు సంబంధించి జిల్లాల వారీగా కేటాయింపుల కోసం ఈ LGD కోడ్లను వినియోగించనుంది.

ఏపీలో గతంలో 13 జిల్లాలకు ఇప్పుడు కొత్తగా మరో 13చేరాయి. దాంతో మొత్తంగా రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26కు చేరింది. కొత్తగా మరో 21 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. దాంతో మొత్తంగా 72 డివిజన్లు అయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనల్ని పరిగణలోకి తీసుకుంది. ఆ తర్వాతే జిల్లాల ఏర్పాటుపై ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ 26 జిల్లాలకు తోడు కొత్తగా మరో జిల్లా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఏజెన్సీ ప్రాంతమైన తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం.. పోలవరం ముంపు ప్రాంతాలతో పాటు మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు గిరిజన జిల్లాలు ఉన్నాయి. మరి కొత్తగా మరో కొత్త జిల్లా ఏర్పాటు అవుతుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

Read Also : AP New Districts : ఏపీలో మొత్తం జిల్లాలు 26, రెవెన్యూ డివిజన్లు 73, పూర్తి వివరాలు