Chandrababu Naidu : భోరున విలపించిన చంద్రబాబు

టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బోరున విలపించారు. వైసీపీ ప్రభుత్వం, నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను ఆయన తప్పుబట్టారు.

Chandrababu Naidu : భోరున విలపించిన చంద్రబాబు

Chandra

Chandrababu Naidu : టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భోరున విలపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..తమను ఘోరంగా అవమానిస్తున్నారని, గత రెండున్నరేళ్లుగా బండబూతులు తిడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ..తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వెక్కివెక్కి ఏడ్చారు. కొద్దిసేపటి అనంతరం ఆయన మళ్లీ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని అన్ని విధాల అవమానిస్తోంది.. వ్యక్తిగత విమర్శలు చేశారు..ఎన్నో అవమానాలు భరించామన్నారు. చివరకు తన భార్యను కూడా అవమానిస్తున్నారని, నా భార్య కూడా ఎంతో సహకరించిందని తెలిపారు.

Read More : Chandrababu: సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతా!

తన భార్యకు ఎప్పుడూ రాజకీయాలపై ఆసక్తి లేదని, తమ పార్టీ నేతల్లో చాలా మంది నా భార్యకు తెలియదన్నారు. నా భార్య త్యాగం..నా పోరాటం అంతా ప్రజల కోసమేనన్నారు. అయితే..వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..ప్రతిపక్షాన్ని అవమానిస్తోందని, ప్రతిపక్ష నేతనన్న గౌరవం లేకుండా మాట్లాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ కూడా వైసీపీ సభ్యుల తీరును తప్పుబట్టడం లేదన్నారు.

Read More : Heavy Rains in Tirupaty: తిరుచానూరులో కుప్పకూలిన ఇల్లు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2021, నవంబర్ 19వ తేదీ శుక్రవారం జరిగిన సమావేశంలో అధికారపక్షం, విపక్ష సభ్యుల మధ్య మాటలతూటాలు పేలాయి. ఈ సందర్భంగా బాబు సభలో జరిగిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, తాను ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాతే..సభలో అడుగుపెడుతానని శపథం చేసి వెళ్లిపోవడం సంచలనం సృష్టించింది. అనంతరం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కన్నీళ్లు పెట్టారు.

Read More : AP Heavy Rains: వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులు.. టాప్‌ పైకి ఎక్కి కాపాడాలంటూ ప్రయాణికుల ఆర్తనాదాలు..

టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో…తాను ఎవరినీ వ్యక్తిగతంగా అవమానించలేదని, నాకు పదవులు అవసరం లేదన్నారు. దీనికన్న పెద్ద రికార్డులు లేవని చెప్పారు. తన రికార్డులు బద్దలు కొట్టడానికి చాలా సమయం పడుతుందని అధికారపక్షాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవం కోసం 40 ఏళ్లుగా పనిచేయడం జరిగినట్లు చెప్పారు. అనేక మంది నాయకులతో తాను పని చేయడం జరిగిందని, ఎన్నికల్లో గెలిచాం..ఓడిపోయామన్నారు. తమ వ్యక్తిత్వాలను కించపరిచేలా వైసీపీ ప్రవర్తించిందని, ఓడినప్పుడు కుంగిపోలేదు..గెలిచినప్పుడు రెచ్చిపోలేదన్నారు. వాజ్ పేయి గతంలో ప్రధానిగా ఉన్న సమయంలో తనను మంత్రి పదవిలో చేరాలని అనడం జరిగిందని, కానీ..తమ రాష్ట్రానికి పనులు చేయాలని సున్నితంగా తిరస్కరించినట్లు ఆనాటి విషయాలను వెల్లడించారు.