Chandrababu : ఫైబర్ నెట్ కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్

జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం చంద్రబాబు ఎస్ ఎల్ పీపై విచారణ చేపట్టనుంది. సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అన్న అంశం తేల్చనున్నారు.

Chandrababu : ఫైబర్ నెట్ కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్

Chandrababu Anticipatory Bail Petition

Chandrababu Anticipatory Bail Petition : ఫైబర్ నెట్ కేసులో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ రద్దు చేయడంతో టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. చంద్రబాబు పిటిషన్ 67వ కేసుగా నమోదు అయింది. మరోవైపు చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరుగనుంది.

జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం చంద్రబాబు ఎస్ ఎల్ పీపై విచారణ చేపట్టనుంది. సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అన్న అంశం తేల్చనున్నారు. ఇప్పటికే చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదనలు వినిపించనున్నారు. సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్ ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనున్నారు. అనంతరం హరీష్ సాల్వే సైతం కౌంటర్ వాదనలు వినిపించనున్నారు.

Chandrababu Health : చంద్రబాబు ఆరోగ్యం గురించి ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు- హెల్త్ బులెటిన్ విడుదల చేసిన జైలు అధికారులు

ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ ప్రారంభయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇద్దరు న్యాయమూర్తులు వేరే బెంచ్ లో ఉంటే మాత్రం విచారణ సోమవారానికి వాయిదా ఛాన్స్ కూడా ఉంది. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తన అరెస్టు చెల్లదని చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు దాఖలు చేసిన రెండు పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది.