Chevireddy Bhaskar Reddy : వైసీపీ ఎమ్మెల్యే గొప్పమనసు… రూ.25లక్షల సొంత డబ్బుతో కరోనా రోగులకు ఆక్సిజన్ బెడ్లు.. చంద్రబాబు స్వగ్రామం సహా

చిత్తూరు జిల్లా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కరోనా బాధితుల కోసం తన సొంత డబ్బుతో ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తన నియోజకవర్గం చంద్రగిరి పరిధిలో మొత్తం రూ.25 లక్షల వ్యయంతో 150 ఆక్సిజన్‌ బెడ్లను సిద్ధం చేయిస్తున్నారు. ఇందులో చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో 100 బెడ్లు ఏర్పాటు చేస్తుండగా, టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలోని పీహెచ్ సీలో 50 బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 500 పడకలతో చంద్రగిరిలోనే మరొక కోవిడ్ సెంటర్

Chevireddy Bhaskar Reddy : వైసీపీ ఎమ్మెల్యే గొప్పమనసు… రూ.25లక్షల సొంత డబ్బుతో కరోనా రోగులకు ఆక్సిజన్ బెడ్లు.. చంద్రబాబు స్వగ్రామం సహా

Chevireddy Bhaskar Reddy

Chevireddy Bhaskar Reddy : చిత్తూరు జిల్లా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కరోనా బాధితుల కోసం తన సొంత డబ్బుతో ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తన నియోజకవర్గం చంద్రగిరి పరిధిలో మొత్తం రూ.25 లక్షల వ్యయంతో 150 ఆక్సిజన్‌ బెడ్లను సిద్ధం చేయిస్తున్నారు. ఇందులో చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో 100 బెడ్లు ఏర్పాటు చేస్తుండగా, టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలోని పీహెచ్ సీలో 50 బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 500 పడకలతో చంద్రగిరిలోనే మరొక కోవిడ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం(ఏప్రిల్ 27,2021) చంద్ర‌గిరి, నారావారిప‌ల్లె ప్ర‌భుత్వాస్ప‌త్రుల‌ను ఎమ్మెల్యే చెవిరెడ్డి సందర్శించారు.

చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుచానూరు సమీపంలో ఉన్న శ్రీ పద్మావతి కోవిడ్‌ సెంటర్‌లో ఇప్పటికే వెయ్యి మంది కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. దీనికి అదనంగా.. చంద్రగిరికి సమీపంలో 500 బెడ్లతో సౌకర్యవంతంగా మరో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. కాగా.. చంద్రగిరి, నారావారిపల్లె ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొనుగోలు కోసం రూ.25 లక్షలు ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని తానే సొంతంగా భరిస్తానని ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రకటించారు.

చంద్రగిరి ప్రాంతీయ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సౌకర్యంతో 100 పడకలు, నారావారి పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో 50 పడకల బెడ్లు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఎమ్మెల్యే తెలిపారు. కాగా, హోమ్‌ ఐసొలేషన్‌లో ఉండే వారికి 34 రకాల వస్తువులతో 2,500 కిట్లను ముందస్తుగా సిద్ధం చేశామన్నారు. కరోనా బాధితులకు టెలీ మెడిసిన్, టెలీ కాన్ఫరెన్స్‌ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఏడు కోవిడ్‌ మెడికల్‌ షాప్‌లు, ఏడు అంబులెన్సులు ఏర్పాటు చేస్తామన్నారు.

మాజీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. చంద్ర‌గిరి నుంచి వైసీపీ నేత చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. చంద్రబాబు స్వగ్రామంలోనూ తన సొంత డబ్బుతో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయడాన్ని స్థానికులు స్వాగతిస్తున్నారు.

చంద్రబాబు స్వగ్రామం అయినప్పటికి.. రాజకీయాలకు అతీతంగా ఇత‌ర గ్రామాల మాదిరిగానే చంద్రబాబు స్వగ్రామాన్ని కూడా ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రేమ‌గా చూస్తున్నారని, అందుకు ఇదే నిదర్శనం అని స్థానికులు అంటున్నారు. నియోజ‌కవ‌ర్గ కేంద్ర‌మైన చంద్ర‌గిరి ప్ర‌భుత్వాస్ప‌త్రిలో 100, అలాగే చంద్రబాబు స్వ‌స్థ‌లం నారావారిప‌ల్లె ప్ర‌భుత్వాస్ప‌త్రిలో 50 చొప్పున 150 ఆక్సిజ‌న్ ప‌డ‌క‌ల‌ను తన సొంత ఖ‌ర్చుల‌తో ఎమ్మెల్యే ఏర్పాటు చేయ‌డం విశేషం. ఇందుకు చెవిరెడ్డి రూ.25 ల‌క్ష‌లు సొంత నిధులు ఖ‌ర్చు చేశారు. కొవిడ్ నియంత్ర‌ణ‌కు, రోగుల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి చూపుతునన చొర‌వ‌ పట్ల స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు అందుతున్నాయి.