Cheating: శ్రీవారి నకిలీ దర్శనం టికెట్లు.. టీటీడీ చైర్మన్ పేరుతో భక్తులకు బురిడీ

తిరుమలలో దర్శనం టికెట్లు ఖరారయ్యాయంటూ టీటీడీ చైర్మన్ కార్యాలయం పేరిట మెసేజ్ పంపిన దళారి వ్యవహారం నకిలీదిగా తేల్చారు చైర్మెన్ కార్యాలయం అధికారులు.

Cheating: శ్రీవారి నకిలీ దర్శనం టికెట్లు.. టీటీడీ చైర్మన్ పేరుతో భక్తులకు బురిడీ

Tirumala Sarva Darshanam

Cheating: తిరుమలలో దర్శనం టికెట్లు ఖరారయ్యాయంటూ టీటీడీ చైర్మన్ కార్యాలయం పేరిట మెసేజ్ పంపిన దళారి వ్యవహారం నకిలీదిగా తేల్చారు చైర్మెన్ కార్యాలయం అధికారులు. గత నెల(సెప్టెంబర్) 23వ తేదీన 15 మందికి దర్శనం చేయిస్తానని గుంటూరు, విజయవాడకు చెందిన భక్తులతో దళారీ ఒప్పందం చేసుకున్నారు.

శ్రీవారి దర్శనం కోసం గుంటూరులో నల్లపాడుకు చెందిన వ్యక్తిని ఆశ్రయించారు భక్తులు నరేంద్ర, అజయ్‌‌లు. ఒక్కో టిక్కెట్‌కు రూ.వెయ్యి చొప్పున మొత్తం రూ.15 వేలు ఇవ్వాలని దళారి కోరారు.

మొత్తం 15 టిక్కెట్లు రూ.12,500లకు ఒప్పందం కుదుర్చుకుని, ఫోన్‌పే, పేటీఎం ద్వారా నగదు తీసుకున్నారు. దర్శనం టిక్కెట్లు బుక్ అయినట్లు టీటీడీ చైర్మన్ కార్యాలయం పేరిట మెసేజ్ పంపారు దళారి. మెసేజ్ ఆధారంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లిన భక్తులు.. మెసేజ్‌ను నకిలీదిగా గుర్తించారు టీటీడీ ఛైర్మెన్ కార్యాలయం అధికారులు.

నిందితుడిపై చర్యలు తీసుకోవాలని గుంటూరు అర్బన్‌ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు భక్తులు. చంటి పిల్లలు, మహిళలతో తిరుమలకు వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడ్డామని దళారిపై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశారు భక్తులు.