CJI Justice NV Ramana : సొంతూరుకు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ.. బాధ్యతలు చేపట్టాక తొలిసారి

హైదరాబాద్ నుంచి సీజేఐ రోడ్డు మార్గాన నందిగామ, పేరకలపాడు గ్రామం మీదుగా సీజేఐ ఎన్వీ రమణ పొన్నవరం చేరుకుంటారు. ముందుగా గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.

CJI Justice NV Ramana : సొంతూరుకు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ.. బాధ్యతలు చేపట్టాక తొలిసారి

Jagan (8)

CJI Justice NV Ramana visit his village : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఇవాళ తన సొంతూరులో పర్యటించబోతున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక.. తొలిసారి కృష్ణా జిల్లాలోని తన స్వగ్రామమైన పొన్నవరానికి వస్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల 30 నిముషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన స్వగ్రామంలోనే గడపనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

ఆయన కుటుంబీకులు, స్నేహితులు, పొన్నవరం గ్రామస్తులు.. ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. పొన్నవరంలో.. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు.. సీజేఐకి స్వాగతం పలకనున్నారు. గ్రామ ముఖద్వారం నుంచి.. ఎద్దులబండిపై ఊరేగింపుగా తీసుకెళ్తారు.

CM Jagan : సీఎం జగన్‌ రెండో రోజు కడప జిల్లా పర్యటన

హైదరాబాద్ నుంచి సీజేఐ రోడ్డు మార్గాన నందిగామ, పేరకలపాడు గ్రామం మీదుగా.. పొన్నవరం చేరుకుంటారు. ముందుగా గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత సీజేఐ ఎన్వీ రమణను గ్రామస్తులు సన్మానించనున్నారు. సీజేఐకి బహూకరించేందుకు పొన్నవరం వాసులు వెండి నాగలిని సిద్ధం చేశారు. సీజేఐ రాకతో గ్రామస్తులంతా ఊరి నిండా ప్లెక్సీలు ఏర్పాటు చేసి.. సాదరంగా స్వాగతం పలుకుతున్నారు.

తమ గ్రామానికి చెందిన వ్యక్తి సీజేఐగా బాధ్యతలు చేపట్టడంతో ఎంతో సంతోషంగా ఫీలవుతున్నారు. రేపు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తేనీటి విందులో సీజేఐ ఎన్వీ రమణ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ను కలుస్తారు.