CM Jagan : సీఎం జగన్‌ రెండో రోజు కడప జిల్లా పర్యటన

ఆదిత్య బిర్లా యూనిట్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. తర్వాత.. జగనన్న గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు పట్టాలు అందజేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

CM Jagan : సీఎం జగన్‌ రెండో రోజు కడప జిల్లా పర్యటన

Jagan (7)

Updated On : December 24, 2021 / 6:37 AM IST

AP CM Jagan Kadapa will : ఏపీ సీఎం జగన్‌ రెండో రోజు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 9గంటలకు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌కు చేరుకొని.. నివాళులర్పిస్తారు జగన్. అక్కడ జరిగే ప్రార్థనల్లో పాల్గొని.. మధ్యాహ్నానికి పులివెందుల ఇండస్ట్రియల్ పార్క్‌కు చేరుకుంటారు. అక్కడ.. ఆదిత్య బిర్లా యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. తర్వాత.. జగనన్న గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు పట్టాలు అందజేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

అక్కడి నుంచి మార్కెట్‌ యార్డుకు చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి. రేపు పులివెందుల చేరుకొని భాకరాపురం సీఎస్ఐ చర్చ్‌లో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. చర్చ్‌ ఆవరణలో నిర్మించిన షాపింగ్‌ క్లాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. తర్వాత.. కడప ఎయిర్ పోర్ట్ నుంచి గన్నవరం బయల్దేరతారు సీఎం జగన్‌.

UPSC CDS 2022 Notification : డిగ్రీ, ఇంజినీరింగ్‌ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

కడప జిల్లా తనను గుండెల్లో పెట్టుకుందన్నారు వైఎస్ జగన్‌. గురువారం ప్రొద్దుటూరులో అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. 5వందల 16 కోట్లతో.. మొత్తం 8 అభివృద్ధి పనులకు జగన్‌ శంకుస్థాపన చేశారు. కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబ్‌ని ప్రారంభించారు. తర్వాత.. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.

రాష్ట్రంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. ఇక.. బద్వేలు నియోజకవర్గంలోని గోపవరం ప్రాజెక్టు కాలనీకి చేరుకుని.. అక్కడ ఆర్డీవో కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం జగన్‌. తర్వాత సెంచరీ ప్లై పరిశ్రమను ప్రారంభించారు.