మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై సీఐబీ కేసు

మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుపై సీఐబీ కేసు నమోదు అయింది. రాయపాటి ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రాయపాటి ఆఫీసులో అధికారులు తనిఖీలు చేపట్టారు.

  • Published By: veegamteam ,Published On : December 31, 2019 / 11:42 AM IST
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై సీఐబీ కేసు

మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుపై సీఐబీ కేసు నమోదు అయింది. రాయపాటి ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రాయపాటి ఆఫీసులో అధికారులు తనిఖీలు చేపట్టారు.

మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుపై సీఐబీ కేసు నమోదు అయింది. రాయపాటిపై 120(బి), రెడ్ విత్ 420, 406, 468, 477(ఎ), పీసీఈ యాక్ట్ 13(2), రెడ్ విత్ 13(1)డి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నవంబర్ 18న సీబీఐకి యూనియన్ బ్యాంకు రీజినల్ హెడ్ భార్గవ ఫిర్యాదు చేశారు. రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రాయపాటి ఇల్లు, ఆఫీసులో అధికారులు తనిఖీలు చేపట్టారు.

ఏకకాలంలో హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఢిల్లీలో రాయపాటికి సంబంధించిన ఇల్లు, కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. రాయపాటికి చెందిన ట్రాన్ ట్రాయ్ కంపెనీలో కూడా సోదాలు చేస్తున్నారు. రూ. 300 కోట్ల బ్యాంకు నుంచి రాయపాటి కంపెని రుణాలు తీసుకున్నాయి. అయితే తీసుకున్న రుణాలను ఇంతవరకు చెల్లించలేదు. దీంతో రాయపాటి కంపెనీపై కేసు నమోదు చేసింది. 

రాయపాటి తోపాటు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ సీఈవో ఇళ్లపై సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ ఎండీ చెరుకూరి శ్రీధర్, రాయపాటి సాంబశివరావు, ట్రాన్స్ ట్రాయ్ డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాస్ లను సీబీఐ నిందితులుగా చేర్చింది.