Chandrababu: హుందాగా పనిచేసిన వ్యక్తి గౌతమ్ రెడ్డి -చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని అపోలో ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని గౌతమ్ రెడ్డి నివాసానికి తరలించారు.

Chandrababu
Chandrababu: ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని అపోలో ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని గౌతమ్ రెడ్డి నివాసానికి తరలించారు. పలువురు రాజకీయ నాయకులు గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని సందర్శించి నివాళుర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గౌతమ్‌రెడ్డి ఇంటికి చేరుకుని పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
నివాళి అర్పించిన అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి కలచి వేసిందని అన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువ నాయకుడు మృతిచెందడం బాధాకరమని అన్నారు చంద్రబాబు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొంది వివాదాలకు దూరంగా.. తనపని తాను హుందాగా చేసుకున్న వ్యక్తి గౌతమ్‌రెడ్డియని అన్నారు చంద్రబాబు.
గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చిన్న వయసులోనే మంత్రి అయ్యి పనిచేసిన ఆయన చనిపోవడం బాధాకరం అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు చంద్రబాబు.
ఈరోజు(21 ఫిబ్రవరి 2022) సాయంత్రం వరకు ప్రజలు, అభిమానుల సందర్శనార్థం గౌతమ్ రెడ్డి భౌతికకాయం జూబ్లీహిల్స్‌లోని మంత్రి నివాసంలో ఉంచనున్నారు. రేపు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో అంత్యక్రియలు జరగనున్నాయి.