AP CM YS Jagan : అనుకున్న లక్ష్యంలోగా పోలవరం పూర్తి – సీఎం జగన్

అనుకున్న లక్ష్యంలోగా ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువచ్చేలా ముందుకు సాగాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. చాలా క్లిష్టమైన సమస్యలు ఉన్నా.. పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని ఆయన వెల్లడించారు. 2021, జూలై 19వ తేదీ సోమవారం పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ సందర్శించారు.

AP CM YS Jagan : అనుకున్న లక్ష్యంలోగా పోలవరం పూర్తి – సీఎం జగన్

Polavaram

Polavaram Construction Works : అనుకున్న లక్ష్యంలోగా ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువచ్చేలా ముందుకు సాగాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. చాలా క్లిష్టమైన సమస్యలు ఉన్నా.. పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని ఆయన వెల్లడించారు. 2021, జూలై 19వ తేదీ సోమవారం పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ సందర్శించారు. తాడేపల్లి నుంచి నేరుగా పోలవరంకు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. అక్కడ మంత్రులు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. పోలవరం పనుల పరిశీలన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం జగన్.

రూ. 2200 కోట్లు పెండింగ్ : –
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి దాదాపుగా రూ.2200 కోట్లు రావాల్సి ఉన్నా… పనులకు ఎక్కడా ఆటంకం రాకుండా రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులను ఇస్తోందన్నారు. ఆరు నెలలుగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు వెల్లడించగా…కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు సకాలంలో వచ్చేలా అధికారులు దృష్టిపెట్టాలన్నారు. కేంద్రం నుంచి బిల్లుల మంజూరుకు సంబంధించి ఒక అధికారిని ఢిల్లీలో ఉంచాలని సీఎం జగన్ సూచించారు. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక అధికారిని పెట్టినట్లు తెలిపారు.

Read More : Niharika Kaur : నిలువెల్లా నిషా ఎక్కిస్తున్న నిహారికా..

పోలవరం పనుల ప్రగతి : –
పోలవరం పనులకు సంబంధించిన ప్రగతిని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. స్పిల్‌వే పనులు దాదాపుగా పూర్తి చేశామని, 48 గేట్లలో 42 గేట్లు అమర్చినట్లు, మిగిలిన గేట్లను కూడా త్వరలోనే బిగిస్తామని అధికారులు తెలిపారు. జర్మనీ నుంచి సిలెండర్ల వచ్చాయని, ఎగువ కాఫర్‌డ్యాంలో అదివరకు ఉన్న ఖాళీలను పూర్తిచేశామన్నారు. ఎర్త్‌కం రాక్‌ఫిల్‌డ్యాం (ఈసీఆర్‌ఎఫ్‌)పనుల గురించి సీఎం జగన్ ఆరా తీశారు. కాఫర్‌ డ్యాంలో ఖాళీలు కారణంగా గతంలో వచ్చిన వరదలకు ఈఎస్‌ఆర్‌ఎఫ్‌ప్రాంతం దెబ్బతిందని… దీనిపనులు ఎలా చేయాలన్నదానిపై డిజైన్లు కూడా ఖరారు చేస్తున్నామని వెల్లడించారు. 2022 జూన్‌కల్లా లైనింగ్‌తో కలుపుకుని రెండు కాల్వలకు లింకు పనులు పూర్తికావాలని, టన్నెల్‌ పనులు, లైనింగ్‌ పనులు ఈ సందర్భంగా సీఎం జగన్ ఆదేశించారు. ఈ డిసెంబర్‌ కల్లా తవ్వకం పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత మిగిలిన పనులు పూర్తి చేస్తామని అధికారులు వివరించారు.

Read More : – L Murugan Parents : కొడుకు కేంద్ర మంత్రి అయినా.. ఎండలో కష్టం చేస్తున్న రైతులు

పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ పై సమీక్ష :-
పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ పై కూడా సీఎం జగన్ సమీక్ష జరిపారు. పనులు ఎంతవరకు వచ్చాయనే దానిపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దన్నారు. పునరావాసల కాలనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదో కట్టాం కదా..అన్నట్లు పునరావాస కాలనీలు ఉండొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కాలనీలు కట్టే సమయంలో..ఎక్కడో ఒక చోట అలసత్వం కనిపించే అవకాశాలు ఉంటాయని, అయితే..వీటికి అవకాశం ఇవ్వొద్దన్నారు. వేగంగా నిర్మించాలని, లక్ష్యాలను త్వరగా చేరుకోవాలన్న ప్రయత్నంలో అక్కడక్కడా తప్పులు జరిగే అవకాశాలు ఉంటాయని, ఈ క్రమంలో…వాటిని సరిదిద్దే ప్రయత్నాలు తప్పకుండా జరగాలన్నారు.

Read More : – Pegasus Project : కలవరపెడుతున్న పెగాసస్ స్పైవేర్, ప్రముఖుల ఫోన్లు హ్యాక్ ?

పునరావాస కాలనీల్లో నాణ్యత ఉండాలి : –
పునరావాస కాలనీల్లో నిర్వాసితులు జీవితాంతం ఉంటారన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని వ్యవహరించాలన్నారు. ఈ విషయంలో కొంత డబ్బు ఎక్కువ ఖర్చుపెట్టినా సరే, నాణ్యత మాత్రం తప్పకుండా పాటించాలని మరోసారి స్పష్టం చేశారాయన. కాలనీల నిర్మాణంతో పాటు.. సమాంతరంగా మౌలిక సదుపాయాల కల్పన కూడా జరగాలన్నారు. రోడ్లు, ఆతర సామాజిక అభివృద్ధి పనులను స్థిరంగా ముందుకు చేసుకుంటూ వెళ్లాలని సీఎం జగన్ సూచించారు.

నిర్వాసితులకు ఇబ్బంది కలుగకూడదు : –
ఆర్‌అండ్‌ఆర్‌ పనుల్లో నాణ్యత కచ్చితంగా పాటించేలా ఒక అధికారిని నియమించాలని, ఈ అధికారి ఇచ్చే ఫీడ్‌ బ్యాక్‌ను తప్పకుండా అధికారులు పరిగణలోకి తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఆగస్టులో కొన్ని ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యం ఉండాలని, వరదల విషయంలో..నవంబరు, డిసెంబరు పట్టే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాలనీలను పూర్తి చేయడానికి దృష్టిపెట్టాలని, ఈ లోగా నిర్వాసితులకు ఇబ్బందులు రాకుండా ప్రజలకు మంచి పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు సీఎం జగన్. దీనికి సంబంధించిన విషయాలను అధికారులు సీఎం జగన్ కు వివరించారు. మొత్తం 90 ఆవాసాల్లో ఆగస్టు నాటికి 48 ఆవాసాల నుంచి నిర్వాసితులను తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

Read More : – Thank you modiji : దండాలయ్యా మోదీజీ

ఆర్అండ్ఆర్ పనులపై దృష్టి: –
గతంలో ఆర్‌అండ్‌ఆర్‌ పనులపై దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యంగా వదిలేశారని, ప్రస్తుతం ప్రభుత్వం దీనిపై పూర్తిగా దృష్టి పెట్టిందనే విషయాన్ని సీఎం జగన్ తెలిపారు.
అంతకుముందు…హెలిపాడ్‌ వద్దనున్న వ్యూ పాయింట్‌ నుంచి ప్రాజెక్టును సీఎం జగన్ పరిశీలించారు. అక్కడ నుంచి ఇటీవలే పూర్తయిన స్పిల్‌వే మీదకు చేరుకుని స్వయంగా జరిగిన పనుల్ని పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఎగ్జిబిషన్‌ ద్వారా పోలవరం పనుల పురోగతిని అధికారులు వివరించారు. రెండేళ్లలో పూర్తయిన పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనుల్ని తెలియచేశారు.