Lakshmi Parvathi: కుప్పంలో చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి విమర్శల జల్లు

చంద్రబాబుకు సొంతబలం లేకపోవడంతోనే పవన్ కల్యాణ్‌ను వెంటేసుకుని తిరుగుతున్నారని తెలిపారు.

Lakshmi Parvathi: కుప్పంలో చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి విమర్శల జల్లు

Lakshmi parvathi

Updated On : May 1, 2024 / 2:44 PM IST

చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ తరఫున తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ లక్ష్మీ పార్వతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. 25 కేసులు ఉన్న చంద్రబాబు రాజకీయాలకు అనర్హుడని చెప్పారు. ఇతర పార్టీల్లోనూ చంద్రబాబు నాయుడి కోవర్టులు ఉన్నారని తెలిపారు.

ఆయన విలువలతో కూడిన రాజకీయం ఏనాడూ చేయలేదని చెప్పారు. చంద్రబాబు గురించి తనకన్నా ఎక్కువగా ఎవరికీ తెలీదని అన్నారు. టీడీపీని స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. ఆ పార్టీ ఆయనకు ఎలా సొంతమైందని ప్రశ్నించారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ఏమి చేశారని నిలదీశారు.

చంద్రబాబుకు విలువలు, విశ్వతనీయత లేదని చెప్పారు. చంద్రబాబు 2014-2019 మధ్య 2 లక్షల కోట్ల రూపాయలు సంపాదించారని అన్నారు. చంద్రబాబు మొత్తగా 6 లక్షల కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పారు.

భరత్ గెలుపుపై తమకు విశ్వాసం ఉందని తెలిపారు. 75 ఏళ్ల వయసులో చంద్రబాబు ఏమి చేయగలరని అన్నారు. సీఎం రమేశ్ పేరుతో లోకేశ్ ఫ్లైట్ కొన్నారని చెప్పారు. చంద్రబాబుకు సొంతబలం లేకపోవడంతోనే పవన్ కల్యాణ్‌ను వెంటేసుకుని తిరుగుతున్నారని తెలిపారు.