Tdp Janasena Manifesto : మీ హామీలన్నీ మా పథకాలే- కూటమి మ్యానిఫెస్టోపై వైసీపీ తీవ్ర ఆరోపణలు

2014-19 మధ్య చంద్రబాబు హయాంలో మూతబడిన 5వేల స్కూళ్లను జగన్ ప్రభుత్వం ఇప్పటికే పునరుద్ధరించి అందుబాటులోకి తెచ్చింది.

Tdp Janasena Manifesto : మీ హామీలన్నీ మా పథకాలే- కూటమి మ్యానిఫెస్టోపై వైసీపీ తీవ్ర ఆరోపణలు

Tdp Janasena Manifesto : వైసీపీ పథకాలనే టీడీపీ, జనసేన కూటమి మ్యానిఫెస్టోలో హామీలుగా చేర్చిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి హామీలన్నీ ఐదేళ్లుగా సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తోందని వారంటున్నారు. స్కూల్ కి వెళ్లే విద్యార్థులకు ఏడాదికి రూ.15వేలు ఇస్తామని టీడీపీ, జనసేన హామీ ఇచ్చాయని.. అమ్మఒడి కింద ఇప్పటికే సీఎం జగన్ నెలకు ప్రతి తల్లికి రూ.15వేలు అందిస్తున్నారని అన్నారు. ఈ మొత్తాన్ని రూ.17వేలకు పెంచుతాని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పునరుద్దరిస్తామని టీడీపీ, జనసేన హామీ ఇచ్చాయి. ఇప్పటికే ఈ పథకం జగనన్న విదేశీ విద్యాదీవెన పేరుతో అమలవుతోంది. ఒక్కొక్కరికి లక్ష 25వేల వరకు ఆర్థిక సాయం అందిస్తోంది. కేజీ టు పీజీ సిలబస్ ను రివ్యూ చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. జగన్ ప్రభుత్వం ఇప్పటికే కేజీ టు పీజీ సిలబస్ ను రివ్యూ చేయడమే కాదు.. డిగ్రీలో ఆనర్స్ కు అవకాశం కూడా ఇచ్చింది. ఉన్నత విద్యలో అంతర్జాతీయ వర్సిటీలు అందించే 2వేల కోర్సులను ఎడ్ ఎక్స్ సర్టిఫికేషన్ ద్వారా ఇప్పటికే అందిస్తోంది.

రాష్ట్రంలో అనేక స్కూళ్లు మూతపడటానికి కారణమైన జీవో 117 రద్దు చేస్తామని, మూతపడిన స్కూల్స్ ను తిరిగి ఓపెన్ చేస్తామని టీడీపీ-జనసేన కూటమి హామీ ఇచ్చింది. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో మూతబడిన 5వేల స్కూళ్లను జగన్ ప్రభుత్వం ఇప్పటికే పునరుద్ధరించి అందుబాటులోకి తెచ్చింది. జీవో 117 ద్వారా విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్లను ప్రశేపెట్టింది.

ప్రతీ కుటుంబానికి రూ.25లక్షల వరకు ఆరోగ్య బీమా అందిస్తామని కూటమి హామీ ఇచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్యశ్రీ కింద రూ.25లక్షల వరకు ఖర్చు చేస్తోంది. బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యునికబుల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ చేస్తామని కూటమి హామీ ఇవ్వగా.. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో విధాలుగా కార్యక్రమాలు చేపట్టింది. ఫ్యామిలీ డాక్టర్, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాల ద్వారా బీపీ, షుగర్ ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. వారందరికి సొంత ఊరిలోనే ప్రభుత్వ వైద్యులు పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు. కిడ్నీ, తలసేమియా వంటి వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10వేలు పెన్షన్ ఇస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం కిడ్నీ, తలసేమియా, సికిల్ సెల్ వంటి వ్యాధిగ్రస్తులకు నెలకు 10వేల చొప్పున పెన్షన్ ఇస్తోంది.

Also Read : బాలకృష్ణకు వణుకు పుట్టిస్తున్న పరిపూర్ణానంద..! కూటమి అభ్యర్థులకు రెబల్స్ గండం