AP Cabinet : నేడు రాజ్‌భవన్‌కు పాత మంత్రుల రాజీనామాలు.. రేపు గవర్నర్‌కు కొత్త మంత్రుల జాబితా

అన్ని కాంబినేషన్లపై కసరత్తు చేస్తున్న సీఎం జగన్.. అన్ని అంశాలనూ పరిగణలోకి తీసుకున్నారు. కొత్త, పాత మంత్రుల మేళవింపుతో కేబినెట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

AP Cabinet : నేడు రాజ్‌భవన్‌కు పాత మంత్రుల రాజీనామాలు.. రేపు గవర్నర్‌కు కొత్త మంత్రుల జాబితా

Cm Jagan (3)

CM Jagan exercise : ఏపీ కేబినెట్ కూర్పుపై కసరత్తు కొనసాగుతోంది. నూతన కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కొత్త వాళ్లెవరు.. పాత వాళ్లలో అవకాశం దక్కేదెవరికి.. ఏపీలో ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. ఎల్లుండి మంత్రివర్గ పునర్వస్థీకరణ ఉండగా.. సోమవారం ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే.. సీఎం జగన్ కేబినెట్‌లో ఉండేదెవరు ఇదే ప్రశ్న వినిపిస్తోంది.

రేపు మధ్యాహ్నం వరకు కేబినెట్ కూర్పుపై కసరత్తు జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ సీఎం జగన్‌తో సజ్జల రెండు సార్లు సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు మంత్రులకు సమాచారం వెళ్తుందని.. అప్పటి వరకూ కేబినెట్‌పై కసరత్తు కొనసాగుతుందని సజ్జల చెప్పారు.

AP Cabinet : ఏపీ మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు

అన్ని కాంబినేషన్లపై కసరత్తు చేస్తున్న సీఎం జగన్.. అన్ని అంశాలనూ పరిగణలోకి తీసుకున్నారు. కొత్త, పాత మంత్రుల మేళవింపుతో కేబినెట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనుభవం, సామాజిక వర్గం, ప్రాంతాన్ని బట్టి కేబినెట్‌లో చోటు కల్పించే విషయంపై సీఎం జగన్ దృష్టిపెట్టారు. అంతే కాకుండా.., మహిళలకు కూడా సముచిత స్థానం కల్పించాలని నిర్ణయించారు.

కేబినెట్ కూర్పుపై రేపు మధ్యాహ్నం వరకు కసరత్తు కొనసాగుతుందని సజ్జల తెలిపారు. రేపు మ.2 గంటల తర్వాత కొత్త మంత్రులకు సమాచారం వెళ్తుందని చెప్పారు. పాత, కొత్త మంత్రుల కలయికగా కేబినెట్ ఉంటుందని పేర్కొన్నారు. ఎవరినీ బుజ్జగించాల్సిన అవసరం లేదన్నారు. బీసీలు, మహిళలకు సముచిత స్థానం కల్పిస్తామని ఉంటుందని చెప్పారు. అనుభవం, సామాజిక వర్గం, ప్రాంతాన్ని బట్టి కేబినెట్‌లో స్థానం దక్కుతుందని స్పష్టం చేశారు.