CM Jagan : ఈ ఏడాది 27 మందికి వైఎస్సార్ అవార్డ్స్ ప్రదానం : సీఎం జగన్

తెలుగు వాడి గుండె ధైర్యానికి, రైతులపైన మమకారానికి వైఎస్సార్ పేరిట అత్యున్నత అవార్డులు ప్రదానం చేస్తున్నామని పేర్కొన్నారు.

CM Jagan : ఈ ఏడాది 27 మందికి వైఎస్సార్ అవార్డ్స్ ప్రదానం : సీఎం జగన్

CM Jagan (5)

CM Jagan – YSR Life Time Awards : ఆంధ్రప్రదేశ్ అవతరించి నేటికి 67 సంవత్సరాలైందని సీఎం జగన్ అన్నారు. వైఎస్సార్ అవార్డ్స్ ప్రదానోత్సవాన్ని మూడవ సారి జరుపుకుంటున్నామని తెలిపారు. సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఎంతగానో ఎదిగిన సామాన్యులకు సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది 27 మందికి అవార్డులు ప్రదానం చేస్తున్నామనిత తెలిపారు.

బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం జగన్, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలుగు వాడి గుండె ధైర్యానికి, రైతులపైన మమకారానికి వైఎస్సార్ పేరిట అత్యున్నత అవార్డులు ప్రదానం చేస్తున్నామని పేర్కొన్నారు.

Vivek Venkataswamy : నాకు టిక్కెట్ ముఖ్యం కాదు.. కేసీఆర్ సర్కారుపై పోరాడటమే ముఖ్యం : వివేక్

విద్య, వైద్యం, గృహ నిర్మాణం ఇలా పేదలను గత ప్రభుత్వాలు విస్మరించినా వైఎస్సార్ అనేక సంక్షేమ పథకాలతో రూపు రేఖలు మార్చారని కొనియాడారు. అవార్డులు అందుకుంటున్న వారంతా తమ తమ రంగాలలో సేవలందిస్తున్నవారేనని తెలిపారు. చరిత్రలో కనివీనీ ఎరుగని విధంగా అవార్డుల ప్రదానం జరుగుతుందన్నారు.

మరోవైపు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీ భవన్ ను అధికారులు సుందరంగా ముస్తాబు చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హెల్త్ క్యాంప్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.