Ragi Java : ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ పంపిణీ.. మార్చి21న వర్చువల్ గా ప్రారంభించనున్న సీఎం జగన్

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేయనున్నారు. మంగళవారం(మార్చి21)న సీఎం జగన్ తాడేపల్లి సీఎం కార్యాలయం నుండి వర్చువల్ గా రాగి జావ పంపిణీ ప్రారంభించనున్నారు.

Ragi Java : ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ పంపిణీ.. మార్చి21న వర్చువల్ గా ప్రారంభించనున్న సీఎం జగన్

ragi java

Ragi Java : ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేయనున్నారు. మంగళవారం(మార్చి21)న సీఎం జగన్ తాడేపల్లి సీఎం కార్యాలయం నుండి వర్చువల్ గా రాగి జావ పంపిణీ ప్రారంభించనున్నారు. సుమారు 37 లక్షల మంది విద్యార్థులకు వారంలో 3 రోజులు రాగిజావ పంపిణీ చేయనున్నారు. దీనికై రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.86 కోట్లు అదనంగా ఖర్చు చేయనుంది. విద్యార్థులకు పల్లి చిక్కీ ఇవ్వని రోజులైన మంగళ, గురు, శనివారాల్లో రాగిజావ ఇవ్వనున్నారు.

Ragi Java : ఆరోగ్యానికి మేలు చేసే రాగి ముద్ద, రాగి జావ

రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని 37,63,698 మంది విద్యార్థులకు అందించనున్నారు. ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయంతో రాగి జావ అందించనున్నారు. గత ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఏటా సగటున రూ.450 కోట్లు అయితే దాదాపు 4 రెట్లు జగనన్న గోరుముద్ద పథకం కింద ఏడాదికి రూ.1,824 కోట్లు ఖర్చు చేస్తోంది. రాగి జావకు ప్రతి ఏటా రూ.86 కోట్లతో మొత్తం రూ.1910 కోట్ల వ్యయం చేస్తోంది.